ETV Bharat / business

'ప్రభుత్వ చర్యలతో ఆర్థిక రికవరీకి చేరువలో భారత్‌' - ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​

ఆర్థిక రికవరీకి భారత్​ దగ్గరైనట్టు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ పేర్కొన్నారు. ప్రభుత్వం, ఆర్​బీఐ చేపడుతున్న సరళ పరపతి సమీక్ష విధానాలు ఇందుకు తోడ్పడుతున్నట్టు స్పష్టం చేశారు.

India at doorstep of economic revival, says RBI Governor Das
'ఆర్థిక రికవరీకి చేరువలో భారత్‌'
author img

By

Published : Oct 22, 2020, 7:15 AM IST

ప్రభుత్వం, ఆర్‌బీఐ చేపడుతున్న సరళ పరపతి సమీక్షా విధానాలు, ద్రవ్యపరపతి విధానాల వల్ల ఆర్థిక రికవరీకి భారత్‌ దగ్గరైనట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌ ఎన్‌.కె. సింగ్‌ రాసిన 'పోర్ట్రెయిట్‌ ఆఫ్‌ పవర్‌: హాఫ్‌ ఎ సెంచరీ ఆఫ్‌ బీయింగ్‌ రింగ్‌సైడ్‌' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దాస్‌ మాట్లాడుతూ 'ఆర్థిక సంస్థలన్నిటి దగ్గరా వృద్ధికి మద్దతునివ్వడానికి సరిపడా మూలధనం ఉంది' అని తెలిపారు. కరోనా పరిస్థితులు స్థిమితపడ్డ వెంటనే అన్ని బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు(ఎన్‌బీఎఫ్‌సీలు) అంతర్గతంగా ఒత్తిడి ఎంత ఉందో పరిశీలన చేసుకోవాలని, మూలధన నిల్వలు పెంచుకోవాలని సూచించారు. కరోనా సంబంధిత సవాళ్లను ఎదుర్కోవడానికి ద్రవ్య విస్తరణ మార్గాన్ని భారత్‌ పాటిస్తోందని, ఆర్‌బీఐ అమ్ములపొదిలో లేని అస్త్రాలను కూడా వినియోగించామని వివరించారు.

బ్యాంకులకు రూ. లక్ష కోట్లు..

వ్యవసాయం, రిటైల్‌, ఔషధ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల వంటి పలు రంగాలకు ద్రవ్యలభ్యతను సమకూర్చేందుకు బ్యాంకులకు రూ.లక్ష కోట్ల విలువైన 'ఆన్‌ టాప్'‌ టార్గెటెడ్‌ లాంగ్‌ టర్మ్‌ రెపో కార్యకలాపాల(టీఎల్‌టీఆర్‌ఓ)ను ఆర్‌బీఐ బుధవారం ప్రకటించింది. ఈ సదుపాయం కింద బ్యాంకులు చేసే పెట్టుబడులకు కొన్ని వెసులుబాట్లు ఇస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.

ఇదీ చూడండి:- వరదలతో పాడైన వాహనాలకు బీమా వర్తిస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.