పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం పెంచేందుకు, సౌకర్యవంతంగా సేవలు పొందేందుకు వీలుగా.. ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను సోమవారం ప్రారంభించనుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకారం.. త్వరితగతిన రీఫండ్ల కోసం ఈ కొత్త పోర్టల్ (www.incometax.gov.in) ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) ప్రాసెసింగ్ వ్యవస్థతో అనుసంధానమై పని చేయనుంది.
కొత్త పోర్టల్‌తో పాటే మొబైల్ యాప్‌ను కూడా విడుదల చేయనున్నట్లు తెలిపింది ఐటీ శాఖ.
కొత్త పోర్టల్ విశేషాలు..
- ఇన్టరాక్షన్స్, అప్లోడ్స్, పెండింగ్‌లో ఉన్న పనులు అన్నీ ఒకే డాష్ బోర్డ్‌పై కనిపించనున్నాయి.
- ఐటీఆర్ 1, 2, 4ను సులభంగా దాఖలు చేసేందుకు ఉచితంగా ప్రీ ఫైలింగ్ సాప్ట్వేర్ అందుబాటులో ఉండనుంది.
- ఐటీఆర్ 3, 5, 6, 7 దాఖలుకు సంబంధించిన సాఫ్ట్వేర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.
- రీఫండ్‌కు సమస్యలను వేగంగా పరిష్కరించే సదుపాయం.
- ఫైలింగ్ దాఖలు, ఆదాయపు పన్ను శాఖ నోటీసులకు స్పందించడం, ఫేస్‌లెస్ స్క్రూట్నీ వంటివి సులభంగా చేసుకోవచ్చు.
- ప్రీ ఫైలింగ్ కోసం.. పన్ను చెల్లింపుదారులు ఎప్పటికప్పుడు తమ వేతనం, ప్రాపర్టీ, వ్యాపారాల వివరాలను అప్డేట్ చేసుకునే వీలు.
- పన్ను చెల్లింపుదారుల సందేహాలను తీర్చేందుకు కాల్‌సెంటర్, లైవ్ చాట్‌బాట్ ఏజెంట్ సహా.. ఎక్కువ మంది అడిగిన సందేహాలు వాటి సమాధానలతో కూడిన ఎఫ్ఏక్యూ కూడా అందుబాటులో ఉండనుంది.