ETV Bharat / business

ఆదాయ పన్ను చెల్లింపునకు ఏ విధానం బెటర్?

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్​లో పాత పన్ను విధానంతో పాటు కొత్త పన్ను విధానాన్ని కూడా అందుబాటులో ఉంచింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఏ విధానంలో పన్ను ఆదా అవుతుందనే గందరగోళం అనేకమందిలో నెలకొంది. వారి కోసమే ఈ కథనం..

income tax calculator
ఆదాయ పన్ను చెల్లింపునకు ఏ విధానం బెటర్?
author img

By

Published : Feb 16, 2020, 6:04 AM IST

Updated : Mar 1, 2020, 12:01 PM IST

వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. ఈ నెల 1న కేంద్రం బడ్జెట్​ ప్రవేశపెట్టింది. ఇందులో ఆదాయ పన్ను చెల్లింపునకు కొత్త విధానాన్ని ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. అయితే పాత, కొత్త పన్ను విధానం రెండింటిలో ఏదైనా ఒక దాన్ని ఐచ్ఛికంగా ఎంచుకునే వెసులుబాటు కల్పించింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఈ రెండు విధానాల్లో ఏది ఎంచుకోవాల‌ని వేతన జీవులు ఆలోచిస్తున్నారు. మీరు అందులో ఒకరైతే.. మీకు ఏ విధానం అనుకూలంగా ఉంటుందో తెలుసుకోండి ఇలా.

ఎవరెవరికి ఏ విధానం లాభం?

సెక్ష‌న్ 80 సీ కింద ప‌న్ను మిన‌హాయింపులు ల‌భించే పీపీఎఫ్‌, బీమా, ట్యూష‌న్ ఫీజు, ట్యాక్స్ సేవింగ్ మ్యూచువ‌ల్ ఫండ్లు వంటివాటిలో పెట్టుబ‌డులు లేనివారికి కొత్త ప‌న్ను విధానంతో ప్ర‌యోజ‌నం పొందుతారు.

పెట్టుబ‌డులు ఉన్న‌వారికి మిన‌హాయింపులు ల‌భిస్తాయి కాబ‌ట్టి పాత ప‌న్ను విధానాన్నే కొన‌సాగించ‌వ‌చ్చు.

ఈ-క్యాలిక్యులేటర్​తో సులభంగా...

ఈ రెండింటికి మ‌ధ్య వ్య‌త్యాసం తెలుసుకునేందుకు ఆదాయ ప‌న్ను శాఖ ప్ర‌వేశ‌పెట్టిన ఈ-కాలిక్యులేట‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఐటీ శాఖ వెబ్ పోర్టల్ లో ప్రత్యేక కాలిక్యులేటర్ ఏర్పాటు చేసింది. దీంతో పాత పద్ధతిలో , కొత్త విధానంలో చెల్లిస్తే ఎంత‌ పన్ను ఆదా అవుతుంది అనేది తెలుసుకోవచ్చు. ఇందులో వ్యక్తి తమ వయస్సుతో పాటు, వార్షిక స్థూల ఆదాయం, ఆదాయ వనరులు, అనుమతించిన మినహాయింపులు, తగ్గింపులు ఎంటర్ చేసి క్లిక్ చేయాలి. ఇచ్చిన వివ‌రాల ప్ర‌కారం పాత విధానంలో పన్ను ఎంత పడుతుంది? కొత్త విధానంలో పన్ను కట్టాల్సి ఉంటుందనేది తెలుసుకునే వీలుంది.

ఉదాహ‌ర‌ణ‌కు మీ వార్షిక ఆదాయం రూ.10 ల‌క్ష‌లు అయితే ఎలాంటి మిన‌హాయింపులు, త‌గ్గింపులు లేక‌పోతే పాత ప‌న్ను విధానం ప్ర‌కారం రూ.1,17,000 ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే కొత్త ప‌న్ను విధానంలో అయితే రూ.78,000 ప‌డుతుంది. అంటే కొత్త ప‌న్ను విధానం ప్ర‌కారం అయితే రూ.39,000 ఆదా అవుతుంది. అదే రూ.2 లక్ష‌లు క్లెయిమ్ చేసుకుంటే కొత్త ప‌న్ను విధానంలోనే రూ.2,600 అద‌నంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే మిన‌హాయింపులు క్లెయిమ్ చేసుకుంటే పాత విధానం, పెట్టుబ‌డులు లేన‌ప్పుడు కొత్త విధానం అనుకూలంగా ఉంటుంది. అయితే ఆదాయ ప‌న్ను శాఖ ప్ర‌వేశ‌పెట్టిన కాలిక్యులేట‌ర్‌తో సుల‌భంగా ప‌న్ను చెల్లింపుదారులో లెక్కించుకోవ‌చ్చు. నిపుణుల అవ‌స‌రం రాద‌ని ఆదాయ శాఖ చెప్తోంది.

ఇదీ చూడండి:ఏటీఎం విత్‌డ్రా.. ఇకపై మరింత భారం కానుందా?

Last Updated : Mar 1, 2020, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.