ETV Bharat / business

కొత్త ఇల్లు కట్టుకున్నారు సరే.. మరి బీమా ఉందా? - home insurance types news

బోలెడన్ని డబ్బులు పోసి కట్టుకున్న సొంతిల్లు... చిన్న వర్షానికో, వరదకో పాడైపోతే..? ఊహించని సంఘటనలతో మనుషులకే కాదు ఇంటికీ ఇబ్బందులు ఉంటాయి. అందుకే మనలాగే వాటికి చిన్నపాటి బీమా ఉంటే మంచిది. ఎప్పుడైనా ఇల్లు పునరుద్ధరణ చేయించుకోవాల్సి వచ్చినప్పుడు ఆ భారం మనమీద పడదు. మరి బీమా ఎలా ఎంచుకోవాలి..? వాటిలోని రకాలు..? వంటి అంశాలను తెలుసుకుందాం.

home insurance policy
ముంపు ప్రాంతంలో ఇల్లుందా..? అయితే కావాల్సిందే బీమా!
author img

By

Published : Aug 30, 2020, 9:01 AM IST

ఈ సాంకేతికత ప్రపంచంలో కాలంతో పాటు అనిశ్చిత పరిస్థితులూ పెరిగిపోతున్నాయి. అందుకే ఎండాకాలంలో వర్షాలు, చలికాలంలో వరదలు, వర్షాకాలంలో మండుటెండలు చూడాల్సి వస్తోంది. వాతావరణం ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితి! ఇక వరుణుడు అయితే అతివృష్టి లేదంటే అనావృష్టితో ఇబ్బందులు పెడుతున్నాడు. ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాలకైతే చాలా ఇళ్లు కొన్ని రోజుల పాటు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. ఈ దెబ్బకు ఎంతో ఇష్టపడి సొంతిల్లు కట్టుకున్నవారి పరిస్థితి ఘోరంగా తయారైంది. లక్షలు పోసి కట్టిన ఇళ్లు సహా దానిలోని సామాగ్రి పాడైపోయాయి. మరి వాటిని తిరిగి పునరుద్ధరించేందుకు ఎంత ఖర్చవుతుంది..? ఆ ఖర్చు వినియోగదారుడి భారమే కదా..! మరి ఇంటి బీమా ఉన్నట్లయితే వాటికి ఓ పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి..

బ్యాంకుల్లోనే బీమా పాలసీలు...

గృహ బీమాలో ఒకేసారి ప్రీమియం చెల్లించాలి. కేవలం ఇంటికే కాకుండా.. ఫర్నీచర్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు తదితర సామాగ్రికి కూడా బీమా పాలసీ తీసుకోవచ్చు. బీమా ఉన్నప్పుడు అగ్ని ప్రమాదాలు, తుపాను, వరదలు వంటి విపత్కర పరిస్థితుల వల్ల ఇల్లు పాడైతే.. దాని పునరుద్ధరణకు అయ్యే ఖర్చు భారం యజమానిపై పడదు. దోపిడీలు వంటి సంఘటనల్లోనూ పరిహారం లభిస్తుంది.

గృహ బీమా అనేది చాలా ముఖ్యం. సహజ, మానవ కల్పిత కార్యకలాపాల వల్ల జరిగిన నష్టాన్ని.. బీమా సంస్థలే భరిస్తాయి! ఇది చిన్న డ్యామేజీలకూ కవరేజీ ఇస్తుంది. గాలి, తుపాను వల్ల ఇంటి పైకప్పు పాడైపోయినప్పుడు.. రిపేరు చేయాల్సి వస్తే బీమాను క్లెయిమ్‌ చేసుకోవచ్చు. తీవ్ర వర్షాల వల్ల పైకప్పు బీటలువారినప్పుడు కూడా బీమా క్లెయిమ్‌ చేసుకోవచ్చు .

వివిధ బీమా సంస్థలు గృహ బీమాను వివిధ రకాల ప్రయోజనాలతో అందిస్తున్నాయి. దాదాపు అన్ని బ్యాంకులు తమ సేవల్లో గృహ బీమాను భాగం చేశాయి. ఆఫ్​లైన్​తో పాటు ఆన్‌లైన్‌ ద్వారా పాలసీ తీసుకునే వీలుంటుంది. గృహ బీమాలో వివిధ పాలసీలు ఉన్న దృష్ట్యా.. అవసరానికి అనుగుణమైన పాలసీని ఎంచుకోవచ్చు.

రకాలు…

సమగ్ర బీమా… ఇంటితో పాటు ఇంటిలోని వస్తువులపైనా బీమా కల్పిస్తుంది. నగలు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, ఇతర పరికరాలు, వ్యక్తిగత సామాగ్రి, ఫర్నీచర్‌, ఇతర విలువైన వస్తువులకూ బీమా అందుతుంది. ఫర్నీచర్‌, నగలు, బీరువాలు తదితర అవసరమైన వస్తువులకూ బీమా అందించే విధంగా హౌజ్‌హోల్డ్‌ ఆర్టికల్స్‌ బీమా తీసుకోవచ్చు.

కేవలం అపార్ట్‌మెంట్‌, ఇళ్లకు మాత్రమే కవరేజీ ఇచ్చేందుకు పాలసీలు ఉన్నాయి. కార్యాలయాలు, దుకాణాల కోసం ప్రత్యేక పాలసీలు ఉన్నాయి. గృహ బీమాతో పాటు యాడ్‌ ఆన్​లను తీసుకోవచ్చు. వీటి ద్వారా అద్దె నష్టపోవటం, తాత్కాలికంగా నివాసం, పెంపుడు జంతువులకు తదితరాలపై బీమా లభిస్తుంది.

వేటికి కవరేజీ?

కొన్ని సందర్భాల్లో బీమా సంస్థలు సాధారణంగా క్లెయిమ్‌ ఇవ్వవు. యుద్ధం, అణుదాడులు జరిగినప్పుడు కవరేజీ ఉండదు. నిరక్ష్యంగా వ్యవహరించడం ద్వారా ఇల్లు దెబ్బతిన్నా కవరేజీ ఉండదు. ప్రత్యేకంగా పొందుపరచకపోతే.. నగలు, సున్నితమైన డాక్యుమెంట్లు,డబ్బులకూ బీమా లభించదు.

సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలకు కవరేజీ ఉంటుంది. అగ్నిప్రమాదం, పిడుగులు, తుపాను, వరదలు, గాలి దుమారం, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం, విమానాలు, మిస్సైల్స్ , ఉగ్రదాడుల్లో ఇల్లు దెబ్బతినటం వంటి వాటికి కవరేజీ ఉంటుంది.

వీటిని తెలుసుకోవాలి…

ఇంటిని సరైన మొత్తంతో బీమా చేయించుకోవాలి. ఈ బీమాను యజమాని మాత్రమే తీసుకోగలరు. బీమా తీసుకునే సమయంలో కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. అన్ని ప్రమాదాల్లో బీమా కల్పించే విధంగా సమగ్ర పాలసీని ఎంచుకోవాలి. ఇల్లు ఉన్న ప్రాంతంలో తరచూ సంభవించే ప్రకృతి వైపరీత్యాల విషయంలో మాత్రం కవరేజీ తప్పకుండా ఉండాలి. క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ రేషియో తప్పకుండా గమనించాలి. ఇంటిని పునరుద్ధరించే సమయంలో నివాసానికి ఖర్చులు అందిస్తుందా? లేదా? అన్నది తెలుసుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.