ETV Bharat / business

ఆరోగ్య బీమా తీసుకోవాలా? ఇవి తెలుసుకోండి.. - ఆరోగ్య బీమా అవసరం ఎంత

అనారోగ్య పరిస్థితుల్లో జేబుకు చిల్లు పడకుండా ఆరోగ్య బీమా ధీమానిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ఆరోగ్య బీమాలు అందుబాటులో ఉన్నాయి. మరి వాటి నుంచి ఉత్తమ పాలసీని ఎలా ఎంపిక చేసుకోవాలి? ఆరోగ్య బీమా ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు మీ కోసం.

Factors to consider before buying Health Insurance
ఆరోగ్య బీమా విషయంలో జాగ్రత్తలు
author img

By

Published : Apr 13, 2021, 5:32 PM IST

ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎప్పుడైనా రావొచ్చు. వచ్చినప్పుడు మాత్రం వ్యక్తిగత ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు ఉపయోగపడేదే ఆరోగ్య బీమా. అనారోగ్య పరిస్థితిలో ఆర్థిక ధీమానిస్తుంది బీమా.

ప్రస్తుతం మార్కెట్లో పలు రకాల ఆరోగ్య బీమాలు అందుబాటులో ఉన్నాయి. చాలా ఆప్షన్లు అందుబాటులో ఉండటం వల్ల ఏ పాలసీ ఎంపిక చేసుకోవాలన్న దానిపై సందిగ్ధత సాధారణమే. ఆరోగ్య బీమాను ఎంచుకునేటప్పుడు ఎలాంటి అంశాలు పరిగణనలోకి తీసుకోవాలో పరిశీలిద్దాం.

వయస్సు

ఆరోగ్య బీమా తీసుకోవడంలో వయస్సు అనేది చాలా ముఖ్యమైన అంశం. పాలసీ తీసుకునేటప్పుడు కుటుంబంలో ఎవరెవరికి బీమా కావాలో మొదట నిర్ణయించుకోవాలి. ఎక్కువ వయస్సున్న వారిమీద బీమా ప్రీమియం నిర్ణయమై ఉంటుంది. పాలసీలో వయస్సుకు సంబంధించిన అర్హతలు తప్పకుండా ముందే చూసుకోవాలి. బీమా తీసుకునేందుకు కనీస వయస్సు, గరిష్ఠ వయస్సులను తెలుసుకోవాలి. కొన్ని పాలసీలు 91 రోజుల వయస్సు నుంచి 50 ఏళ్ల వయస్సు వారికి అందిస్తుండగా... మరికొన్ని ఇతర వయసు నిబంధనలను అనుసరిస్తున్నాయి.

ప్రీమియం, కవరేజీ

తక్కువ ప్రీమియం అని చూడగానే ఆకర్షితులవ్వటం సహజం. తక్కువ ప్రీమియం ఉంటే ప్రయోజనాలు కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తున్నట్లయితే పాలసీ తీసుకోవటం ఉత్తమమే. తక్కువ ప్రీమియంతో పాలసీ ఎందుకిస్తున్నారన్నది చూడాల్సి ఉంటుంది. కో-పేమెంట్, మినహాయింపులు, సబ్- లిమిట్స్ లాంటి వాటిని తెలుసుకోవాలి. క్లెయిమ్ సమయంలో ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందా? లేదా? అన్నది పరిగణనలోకి తీసుకోవాలి.

వెయిటింగ్ పీరియడ్

పాలసీ తరువాత కొన్ని చికిత్సలకు పాలసీ వర్తించే సమయానికి మధ్య ఉండేదే వెయిటింగ్ పీరియడ్. వెయిటింగ్ పీరియడ్​ అనంతరమే ఆ చికిత్సకు సంబంధించిన క్లెయిమ్ చేసుకోవచ్చు. పాలసీ తీసుకునే ముందే ఉన్న వ్యాధులకు సంబంధించి ఈ వెయిటింగ్ పీరియడ్ 24 నుంచి 48 నెలలు లేదా ఇంకా ఎక్కువ కాలం ఉండొచ్చు. వివిధ పాలసీల్లో వ్యాధులకు సంబంధించిన వెయిటింగ్ పీరియడ్​ను పోల్చుకుని బీమా తీసుకోవటం ఉత్తమం.

నగదు రహిత ఆస్పత్రులు

బీమా సంస్థలు ఆస్పత్రులతో ఒప్పందం చేసుకుని బీమాదారులకు నగదు రహిత సేవలను అందిస్తాయి. ఎలాంటి డబ్బులు లేకుండానే ఈ ఆస్పత్రుల్లో చికిత్స పొందవచ్చు. ఎక్కువ ఆస్పత్రులతో బీమా సంస్థకు ఒప్పందాలు ఉన్నట్లయితే మంచిది. బీమా తీసుకునే ముందు ఎక్కువ ఆస్పత్రులతో ఒప్పందాలు ఉన్న బీమా కంపెనీని ఎంచుకోవాలి.

ప్రీ, పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజీ

ఆస్పత్రిలో ఉన్నప్పుడు అయిన ఛార్జీలను చాలా బీమా సంస్థలు కవరేజీ అందిస్తాయి. ఆస్పత్రిలో చేరకముందు కొన్నిసార్లు వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. అదే విధంగా ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన అనంతరం కూడా పలుమార్లు వైద్యుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రావచ్చు. ఈ సందర్భాల్లోనూ ఖర్చు అవుతుంది. వీటికీ కవరేజీ ఇచ్చే బీమాను ఎంపిక చేసుకోవాలి. అలాగే ఎన్ని రోజులు ఈ కవరేజీ ఇస్తాయన్నది కూడా ముందే తెలుసుకోవాలి.

ప్రసూతి ఖర్చులు

ప్రసూతి ఛార్జీలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. కాబట్టి ప్రసూతి ఛార్జీలను భరించే పాలసీ తీసుకోవటం ఉత్తమం. ఈ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే సాధారణంగా 2 నుంచి 4 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. జన్మించిన చిన్నారి మెడికల్ ఛార్జీలను కూడా భరించే పాలసీ అయితే ఇంకా మంచిది. వీటికి సంబంధించిన లిమిటేషన్ల గురించి కూడా తెలుసుకోవాలి.

నో క్లెయిమ్ బోనస్, డిస్కౌంట్

ఒక సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ లేనట్లయితే బీమా కంపెనీలు బోనస్, డిస్కౌంట్ రూపంలో ప్రయోజనాలను ఇస్తుంటాయి. సాధారణంగా క్లెయిమ్ లేనిపక్షంలో తర్వాతి సంవత్సరంలో కవరేజీ మొత్తాన్ని పెంచుతాయి. అయితే కంపెనీలు దీనికి పరిమితిని విధిస్తున్నాయి. బేసిక్ కవరేజీకి 100 శాతం బోనస్ లేదా 50 శాతం బోనస్​గా ఇస్తుంటాయి. కాబట్టి నో క్లెయిమ్ బోనస్​కు సంబంధించిన నిబంధనలు పరిశీలించాలి.

హెల్త్ చెకప్ సౌకర్యం

గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, ఎంఆర్​ఐ లాంటి చెకప్​ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని చేయించుకున్నట్లయితే బీమా సంస్థ ఛార్జీలను భరిస్తుంది. ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు ఈ సౌకర్యం ఉన్న పాలసీని ఎంచుకోవాలి. అంతేకాకుండా దీనికి సంబంధించిన పరిమితిని పరిగణనలోకి తీసుకోవాలి.

కో-పేమెంట్

చాలా మంది కో-పేమెంట్ విషయంలో సందిగ్ధానికి గురవుతుంటారు. క్లెయిమ్ చేసుకునే సమయంలో పాలసీదారుడు చెల్లించాల్సిన మొత్తం ఇది. మిగతా మొత్తాన్ని బీమా సంస్థ భరిస్తుంది. ఎక్కువ కో-పేమెంట్ మొత్తం ఉందా? లేదా? అన్నది గమనించాలి. సబ్ లిమిట్​ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పాలసీ తీసుకునే సమయంలోనే వ్యాధులు ఉన్నట్లయితే లేదా నిర్ణీత వయస్సును దాటినట్లయితే కో-పేమెంట్ అనేది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

క్లెయిమ్ పద్ధతి

పాలసీలో ఉపయోగించిన పదాలు, అదే విధంగా క్లెయిమ్ పద్ధతిని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. క్లెయిమ్ ప్రక్రియ సులభంగా ఉండటం ముఖ్యమైన అంశం. సమీక్షలు చదవటం అవసరమైతే కస్టమర్ కేర్​తో మాట్లాడటం ద్వారా వీటికి సంబంధించి అవగాహన పెంచుకోవచ్చు.

ఇవీ చదవండి:

మీ స్మార్ట్​ఫోన్​కు బీమా చేయించారా?

సైబర్ బీమా గురించి ఇవి తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.