ETV Bharat / business

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడా? ఇవి తెలుసుకోండి.. - మ్యుచువల్ ఫండ్ల పెట్టుబడుల టిప్స్

పెట్టుబడి పెట్టాలనుకుంటే చాలా మందికి మొదటి ఉత్తమ ఎంపిక మ్యుచువల్​ ఫండ్లు. అయితే దేని గురించైనా పూర్తిగా తెలుసుకోకుండా పెట్టుబడులు పెడితే ఆర్థికంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అలాంటి పరిస్థితులు రాకుండా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులకు ముందే తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు మీ కోసం.

Best tips for choose Mutual Funds
ఉత్తమ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవడం ఎలా
author img

By

Published : Oct 30, 2020, 1:30 PM IST

కొత్తగా పెట్టబుడులు ప్రారంభించే వారికి చాలా మంది సూచించే మొదటి సదుపాయం మ్యూచువల్ ఫండ్లు. అయితే తమకు సరిపోయే మ్యూచువల్ ఫండ్​ను ఎంచుకోవటంలో చాలా మందిలో కొంత అయోమయం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ల ఎంపికలో చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాం.

లక్ష్యాలు..

నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా ఫండ్​ను ఎంపిక చేసుకోవాలి. అందుబాటులో ఉన్న కాల వ్యవధి, ఆశిస్తున్న రాబడి లాంటివి ఇందులో ఉంటాయి. లక్ష్యం లేనట్లయితే పెట్టుబడిని మధ్యలోనే ఆపేసే అవకాశం ఉంటుంది. లక్ష్యం స్వల్ప కాలానికి సంబంధించినదైనా, దీర్ఘకాలానికి అయినదైనా కావొచ్చు. మ్యూచువల్ ఫండ్​లో డెట్, ఈక్విటీ, హైబ్రిడ్ ఇలా రకాలు ఉంటాయి. లక్ష్యానికి అనుగుణంగా వీటిని ఎంచుకోవాలి. స్వల్ప కాలం, దీర్ఘకాలం లక్ష్యాలను విడదీసి కూడా ఫండ్ ఎంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

రిస్క్​ గురించి తెలుసుకోవాలి..

పెట్టుబడి పెట్టే ముందు తీసుకోగలిగే రిస్క్ గురించి తెలుసుకోవాలి. దీనికి సరిపోయే విధంగా ఫండ్​ను ఎంచుకోవాలి. సాధారణంగా ఈక్విటీలో ఒడుదొడుకులు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఈ పోర్ట్‌ఫోలియో స్వల్ప కాలంలో హెచ్చుతగ్గులను లోనుకావొచ్చు. మిగతా వాటితో పోలిస్తే ఈక్విటీలలో రాబడి కూడా ఎక్కువగానే ఉంటుంది. దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది సరిపోవచ్చు. డెట్ ఫండ్లలో స్థిరత్వం ఎక్కువ. రాబడి తక్కువగా ఉంటుంది. కాబట్టి రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఫండ్ ఎంచుకోవాలి.

పెట్టుబడి వ్యూహం

పెట్టుబడి పెట్టేందుకు ఫండ్‌ను నిర్వహించే సంస్థ అనుసరించే తీరే పెట్టుబడి వ్యూహం. చాలా మంది దీనిపై నిర్లక్ష్యం వహిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. మనం ఆశిస్తున్న పెట్టుబడి తీరుకు ఇది విరుద్ధంగా ఉన్నట్లయితే అలాంటి ఫండ్​లో పెట్టుబడి చేయటం వల్ల ఏదో ఒక స్థాయిలో ఫండ్ నుంచి బయటికి రావాలనే భావన వస్తుందని, అలాంటి ఫండ్​ను ఎంచుకోకపోవటమే ఉత్తమమని వారు సూచిస్తున్నారు.

ఫండ్ ప్రదర్శన

ఎంత ఎక్కువ కాలం మార్కెట్ పరిస్థితుల ఆధారంగా వెళ్లినట్లైతే ఫండ్​ ప్రదర్శనపై అంత ఎక్కువ స్పష్టత పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో మంచి ప్రదర్శన కనబరిచిన ఫండ్, స్వల్ప కాలంలో మంచి ప్రదర్శన కనబరిచిన దానికంటే మేలుగా ఉండొచ్చని వారు అంటున్నారు.

మూడు, ఐదు, ఏడు, పది సంవత్సరాల వ్యవధిలో దానికి సంబంధించిన బెంచ్ మార్క్ కంటే మెరుగైన ప్రదర్శన లేనట్లయితే భవిష్యత్‌లో కూడా మంచి పెట్టుబడి కాదని భావించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫండ్ మేనేజర్, ఫండ్ మేనేజింగ్ బృందానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని వారు సూచిస్తున్నారు. అనుభవం ఉన్న, స్థిరమైన, ఇప్పటికే నిరూపించుకున్న ఫండ్ మేనేజర్ పెట్టుబడిదారులకు మేలు కలిగించవచ్చని అంటున్నారు.

తక్కువ ఫీజులు, కమీషన్లు ఉండే ఫండ్లు మేలు..

ఖర్చుల నిష్పత్తి, ఎంట్రీ ఎగ్జిట్ లోడ్​ ఫండ్​ను నిర్వహించే మేనేజర్ కమిషన్ లేదా ఫీజు తీసుకుంటారు. వీటిని ఖర్చుల కింద పరిగణించవచ్చు. ఈ ఖర్చును శాతంలో చూసినట్లైతే తక్కువ అనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో పూర్తి పెట్టుబడిని పరిగణనలోకి తీసుకుంటే ఎక్కువే అవుతుంది. తక్కువ ఫీజులు, కమీషన్లతో ఉన్న ఫండ్ ను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

పెట్టుబడి ప్రారంభించేటప్పుడు తీసుకునేది ఎంట్రీ ఫీజు. పెట్టుబడిని ఉపసంహరించుకునే సమయంలో విధించేది ఎగ్జిట్ ఫీజు. మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఎంట్రీ ఫీజును చాలా వరకు తొలగించాయని, ఎగ్జిట్ ఫీజు ఉందని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. అయితే సంవత్సరం లోపు ఉపసంహరించుకున్న వారికే ఎగ్జిట్ ఫీజు ఉంటుంది.. అనే షరతులు దీనికి విధిస్తున్నాయి మ్యూచువల్ ఫండ్ సంస్థలు. చాలా తక్కువ ఎంట్రీ, ఎగ్జిట్ ఫీజు ఉన్న ఫండ్​ను ఎంచుకోవటం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

పన్నులు పరిగణించాలి..

మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకునే సమయంలో పన్నులను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్​లు పన్ను అనంతరం రాబడుల విషయంలో సమర్థంగా ఉన్నప్పటికీ, వాటిపై పన్ను ఉంటుంది. ఈక్విటీ ఫండ్ల విషయంలో 12 నెలల కంటే ఎక్కువ సమయం పెట్టుబడి చేసినట్లైతే రూ.లక్ష మినహాయింపుతో 10 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. 12 నెలల కంటే తక్కువ సమయం పెట్టుబడి ఉన్నట్లయితే 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. డెట్ ఫండ్లలో ఇండెక్సేషన్ ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో దీర్ఘకాలం 36 సంవత్సరాల కంటే ఎక్కువ కాలాన్ని తీసుకుంటారు.

డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లు మ్యూచువల్ ఫండ్లలో రెండు రకాలుంటాయి. ఒకటి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్, రెండోది రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్. డైరెక్ట్ ఫండ్లలో ఎలాంటి కమీషన్ ఉండదు. నెట్ అసెట్ వాల్యూ వద్ద ఈ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. అదే రెగ్యులర్ ఫండ్ వద్ద అయితే కమీషన్ ఉంటుంది. డైరెక్ట్ ఫండ్లలో ఎలాంటి మధ్యస్థ ఛార్జీలు ఉండవు కాబట్టి రాబడి ఎక్కువగా ఉంటుంది.

చివరగా.. మ్యూచవల్ ఫండ్ల ఎంపిక ప్రతి ఒక్కరికి వేరుగా ఉంటుంది. వారి అవసరాలు, లక్ష్యాలు, రిస్క్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని.. వ్యక్తిగత ఆర్థిక నిపుణులను సంప్రదించాకే పెట్టుబడులు పెట్టడం ఉత్తమం.

ఇదీ చూడండి:మ్యూచువల్ ఫండ్లపై సందేహాలకు సమాధానాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.