లగ్జరీ కార్లు, ఆభరణాల కొనుగోలుపై 'టీసీఎస్' (ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్)ను వస్తు సేవల పన్ను మదింపు నుంచి మినహాయిస్తున్నట్లు పరోక్ష పన్నులు, సుంకాల కేంద్ర బోర్డు-సీబీఐసీ ప్రకటించింది.
ఆదాయ పన్ను చట్టం ప్రకారం రూ.10 లక్షలకుపైగా విలువ కలిగిన వాహనాలు, రూ.5 లక్షలకుపైగా నగల కొనుగోళ్లు, రూ.2 లక్షలకుపైగా బులియన్ కొనుగోళ్లపై ఒక శాతం టీసీఎస్ వర్తిస్తుంది.
టీసీఎస్ నుంచి వచ్చే మొత్తన్ని జీఎస్టీతో కలిపి వసూలు చేయనున్నట్లు గతేడాది డిసెంబర్లో సీబీఐసీ ప్రకటించింది. అయితే పలు సంస్థల నుంచి కేంద్ర ప్రత్యక్ష వన్నుల బోర్డుకు అందిన అభ్యర్థనల మేరకు 'సీబీఐసీ' తాజా నిర్ణయం తీసుకుంది.
స్వాగతించిన సంస్థలు
"జీఎస్టీ నుంచి టీసీఎస్ మినహాయిస్తూ సీబీఐసీ ఇచ్చిన స్పష్టత... వాహన సంస్థలకు కాస్త ఊరటనిచ్చే అంశం. జీఎస్టీ ఇతర ఆదాయపన్నులు ఉండకూడదనేది పరిశ్రమ వర్గాల అభిప్రాయం"
-ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రతినిధి అభిషేక్ జైన్