ETV Bharat / business

ఆర్థిక పునరుత్తేజానికి చైనా పాఠాలు భారత్​కు లాభించేనా? - కరోనా వైరస్ ప్రభావం

కరోనా వైరస్​కు ఎదురీదుతూ కుదేలైన ఆర్థిక వ్యవస్థలను చక్కదిద్దేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. భారత్​ కూడా ఇప్పడిప్పుడే లాక్​డౌన్​ నిబంధనలను సడలిస్తోంది. అయితే కరోనా సంక్షోభానికి మూలమైన చైనా పటిష్ఠ చర్యలు, విధానాలతో తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. చైనాతో ఎన్నో సారూప్యతలు ఉన్న భారత్​కు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో డ్రాగన్​ పాఠాలు చాలా విలువైనవి.

Lessons from China
చైనా పాఠాలు
author img

By

Published : May 9, 2020, 4:38 PM IST

కరోనా వైరస్​ విజృంభణతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దాదాపు అన్ని దేశాలు ఈ మహమ్మారి బారినపడ్డాయి. అగ్రరాజ్యాలు కూడా చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో వైరస్​ వ్యాప్తి మొదలైన చైనా.. ఇతర దేశాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

కానీ... ఓ విషయంలో మాత్రం చైనా అందరికన్నా ముందుంది. అదే.. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ.

చైనా విధానాలు భేష్..

మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుతున్న వేళ మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ సమయంలో వేగంగా స్పందించి ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో చైనా అనుసరించిన విధానాలను పరిగణనలోకి తీసుకోవటం ఉత్తమమని విశ్లేషకులు చెబుతున్నారు.

కరోనా ప్రభావం అన్ని దేశాలకన్నా ముందు చైనాపైనే పడింది. అత్యంత కఠిన నిర్బంధ విధానాలతో మహమ్మారి నుంచి బయటపడిన మొదటి దేశంగానూ అవతరించింది. 2020 ఫిబ్రవరికి కేసుల సంఖ్యను నియంత్రణలోకి తెచ్చింది.

మార్చి 10న వైరస్​ కేంద్ర బిందువైన వుహాన్​లో అధ్యక్షుడు జిన్​పింగ్ పర్యటించి కరోనాపై విజయ పతాకం ఎగురవేశారు. మార్చి 19 కల్లా దేశంలో స్థానిక సంక్రమణ సున్నాకు చేరింది.

పారిశ్రామిక ఉత్పత్తి..

ఆరోగ్యపరమైన చిక్కులు వీడాక ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది చైనా. అయితే పాశ్చాత్య దేశాల తరహాలో భారీ ప్యాకేజీలు ప్రకటించలేదు. వాస్తవానికి చాలా చిన్న చర్యలు తీసుకుంది చైనా. నిర్మాణాత్మక విధానాలపై ఆధారపడింది.

స్థానిక ప్రభుత్వాలు, బ్యాంకుల్లో ద్రవ్య లభ్యత ఉండేలా ప్రణాళికలు రచించింది చైనా. ఆర్థిక వ్యవస్థలోకి ఈ డబ్బు చేరేలా చర్యలు తీసుకుంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఉత్పాదకతను తిరిగి ప్రారంభించింది. కరోనా వల్ల స్తంభించిన సరఫరా వ్యవస్థను పునరుద్ధరించింది.

రుణాల మంజూరు..

ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు పారిశ్రామిక ఉత్పత్తి పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యం ఇచ్చింది చైనా. చిన్న వ్యాపారాలకు చౌక రుణాలు అందించేలా విధానాలను రూపొందించింది. లాభాల ఆధారంగా వ్యాపారాలకు 50 లక్షల యువాన్ల హామీ లేని రుణాలను మంజూరు చేసింది. కార్పొరేట్ పన్నులను తగ్గించింది.

అదే సమయంలో ఉపాధి అవకాశాల స్థిరీకరణ కోసం కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంది ప్రభుత్వం. దీనికి అదనంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ట్రిలియన్ల యువాన్ల విలువైన ప్రత్యేక ప్రాతిపదికన బాండ్లు జారీ చేసేందుకు స్థానిక ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చింది. వ్యాపారాలకు సంబంధించిన అద్దె చెల్లింపుల్లో మూణ్నెల్ల పాటు 30 శాతం ఉపశమనం ఇచ్చింది.

వాహన పరిశ్రమ..

తయారీ రంగానికి, ముఖ్యంగా కార్ల పరిశ్రమకు లక్ష్యాలతో కూడిన రాయితీలు ప్రకటించింది. పరిశ్రమ, పర్యావరణ రక్షణ విధానాలను అమలు చేస్తూనే రాయితీలు అందించింది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్​ వాహనాల కొనుగోళ్లపై రాయితీ, పన్ను మినహాయింపు ఇచ్చింది. దీనికి బదులుగా డీజిల్​తో నడిచే వాహనాల రీప్లేస్​మెంట్​కు ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. కారు డీలర్లు కట్టాల్సిన వ్యాట్​ను తగ్గించింది.

రవాణా, నిర్మాణ రంగాల్లో వ్యాట్​ను 10 నుంచి 9 శాతానికి, తయారీ రంగంలో 16 నుంచి 13 శాతానికి తగ్గిస్తున్నట్లు చైనా ప్రధాని లీ కెషాంగ్ ప్రకటించారు.

వినియోగానికి ఊతం..

ఉత్పాదకతతో పాటు వినియోగాన్ని పెంచేందుకు చైనా చర్యలు చేపట్టింది. ఉద్యోగ సృష్టిపైనా దృష్టి సారించింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. ఉదాహరణకు.. కొనుగోళ్లను పెంచేందుకు పౌరులకు కూపన్లను పంపిణీ చేశాయి చాలా రాష్ట్రాలు.

కరోనా బాధితులకు సాయం..

తక్కువ ఆదాయ కుటుంబాలకు మార్చి-జూన్​ కాలానికి గాను తాత్కాలిక నెలసరి అలవెన్సును రెట్టింపు చేసింది కేంద్ర ప్రభుత్వం. సంక్షోభం కారణంగా పెరిగిన ధరలను ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులకు సాయం అందిస్తామని చైనా ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా నిరుద్యోగ భృతి పెంచే యోచనలో ఉంది.

అదనంగా వినియోగ వస్తువుల దిగుమతులపై సుంకాలను తగ్గించింది. చైనా తీసుకున్న ఈ పటిష్ఠమైన చర్యలతో ఆర్థిక వృద్ధి త్వరగా కోలుకోవటమే కాకుండా స్టాక్​ మార్కెట్లు పరుగులు పెట్టాయి.

నిజానికీ కరోనా సంక్షోభం వల్ల మావో మరణం తర్వాత అత్యల్ప స్థాయికి చైనా ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. కానీ ఆ దేశం తీసుకున్న చర్యల ఫలితంగా రెట్టింపు వేగంతో సాధారణ స్థితికి చేరుకుంది. కానీ మిగిలిన ప్రపంచ దేశాలు మాత్రం ఈ పరిస్థితిని బయటపడేందుకు కొట్టుమిట్టాడుతున్నాయి.

అందుకే చైనా అనుసరించిన విధానాలు, అది నేర్పిన పాఠాలు చాలా విలువైనవి. ముఖ్యంగా చైనాతో ఎన్నో అంశాల్లో సారూప్యతలు ఉన్న భారత్​కు మేలు చేకూర్చే అవకాశం ఉంది.

(రచయిత- డాక్టర్ మహేంద్ర బాబు కురువ, బిజినెస్ మేనేజ్​మెంట్​ విభాగంలో సహాయ ఆచార్యులు, హెచ్​ఎన్​బీ గఢ్వాల్​ కేంద్ర విశ్వవిద్యాలయం, ఉత్తరాఖండ్​)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.