ETV Bharat / business

మే నెలలో 65 శాతం పెరిగిన జీఎస్​టీ వసూళ్లు - GST COLLECTION

గతేడాది మేతో పోలిస్తే జీఎస్​టీ వసూళ్లు 65 శాతం పెరిగాయి. అనేక రాష్ట్రాల్లో లాక్​డౌన్ ఉన్నప్పటికీ ఈ నెలలో లక్ష కోట్లు జీఎస్​టీ రూపంలో వసూలయ్యాయి. అయితే, 2021 ఏప్రిల్​తో పోలిస్తే ఈ వసూళ్లు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది.

GST revenue collected in May is Rs 1,02,709
మే నెలలో భారీగా తగ్గిన జీఎస్టీ వసూళ్లు
author img

By

Published : Jun 5, 2021, 4:57 PM IST

Updated : Jun 5, 2021, 5:54 PM IST

మే నెలలో జీఎస్​టీ వసూళ్లు రూ. లక్ష కోట్ల దాటాయి. మొత్తంగా రూ.1,02,709 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇందులో సీజీఎస్​టీ రూ.17,592 కోట్లు ఉన్నట్లు తెలిపింది. ఎస్​జీఎస్​టీ రూ.22,653, ఐజీఎస్​టీ రూ.53,199 కోట్లు వసులైనట్లు వివరించింది.

తాజా వసూళ్లతో వరుసగా ఎనిమిదో నెలలో లక్ష కోట్ల జీఎస్​టీ లభించినట్లైంది. గతేడాది మేతో పోలిస్తే ఈ సారి వసూలైన జీఎస్​టీ 65 శాతం అధికమని తెలుస్తోంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈ వసూళ్లు గణనీయంగా తగ్గిపోయినట్లు స్పష్టమవుతోంది. ఏప్రిల్​లో రూ.1,41,384 కోట్లు జీఎస్​టీ రూపంలో వచ్చాయి. మార్చిలో జీఎస్​టీ వసూళ్లు రూ.1.23 లక్షల కోట్లుగా ఉన్నాయి.

మరోవైపు, సెస్సుల రూపంలో కేంద్రానికి మే నెలలో రూ.9,265 కోట్ల ఆదాయం లభించింది. ఇందులో రూ.868 కోట్లు దిగుమతులపై విధించిన పన్నుల ద్వారా వసూలైంది. అనేక రాష్ట్రాలు లాక్​డౌన్​ ప్రకటించినప్పటికీ రూ. లక్ష కోట్ల జీఎస్​టీ వసూలైందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. మే నెలకు సంబంధించిన మరిన్ని రిటర్నులు జూన్​లో దాఖలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో.. జీఎస్​టీ మరింత పెరుగుతుందని తెలిపింది.

ఇదీ చదవండి- బంగారం మీద రుణాల వ‌డ్డీ రేట్లు- ఏ బ్యాంక్‌లో ఎంత‌?

Last Updated : Jun 5, 2021, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.