ETV Bharat / business

జీఎస్టీ పెంపునకు ప్రభుత్వం సిద్ధంగా లేదా?

అత్యవసరం కాని వస్తువులపై జీఎస్టీ పెంచేందుకు ఆర్థిక శాఖ సిద్ధంగా లేదని తెలుస్తోంది. జూన్​లో జీఎస్టీ సమావేశం జరగనున్న నేపథ్యంలో అధికారిక వర్గాలు ఈ మేరకు అంచనా వేస్తున్నాయి. కరోనా ప్రభావంతో ఇప్పటికే డిమాండ్ పడిపోవటం వల్ల పన్ను పెంచితే ఆర్థిక పునరుద్ధరణకు ఆటంకం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

BIZ-FINMIN-GST
జీఎస్టీ పెంపు
author img

By

Published : May 30, 2020, 6:26 AM IST

Updated : May 30, 2020, 8:12 AM IST

వస్తు సేవల పన్ను (జీఎస్​టీ) మండలి సమావేశం జూన్​లో జరగనుంది. అత్యవసరం కాని వస్తువులపై జీఎస్టీ పెంపునకు కేంద్ర ఆర్థిక శాఖ సిద్ధంగా లేదని తెలుస్తోంది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఆదాయం తగ్గినా యథాస్థితినే కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కరోనా ప్రభావంతో అత్యవసరం కాని వస్తువుల డిమాండ్​ భారీగా పడిపోయింది. వీటిపై జీఎస్టీ విధిస్తే మరింత కుంగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి ఇది ఆటంకమవుతుందని భావిస్తున్నారు.

"లాక్​డౌన్​ ఎత్తివేసిన తర్వాత అత్యవసర వస్తువులతోపాటు అన్ని రంగాలకు డిమాండ్ పెరిగేలా చూడాలి. అయితే నిర్ణయం తీసుకునేది మండలికి అధ్యక్షత వహించే కేంద్ర ఆర్థిక మంత్రి. వచ్చే నెలలో జరిగే మండలి సమావేశంలో రేట్లకు సంబంధించిన చర్చ జరుగుతుంది. దీనికి రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరవుతారు."

- అధికారిక వర్గాలు

ప్రస్తుత సమయంలో ఆర్థిక లోటును పూడ్చేందుకు ప్రభుత్వం ఎలాంటి వనరులు(నోట్ల ముద్రణ) వినియోగించలేదని అధికార వర్గాలు తెలిపాయి.

కరోనా ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంటుందో స్పష్టంగా చెప్పలేమని అన్నారు. ప్రస్తుతానికి అప్పు పరిమితిని రూ.7.8 లక్షల కోట్ల నుంచి 12 లక్షల కోట్లకు పెంచింది. ఇది బడ్జెట్​ అంచనాల కన్నా 4.2 లక్షల కోట్లు అధికం.

పన్ను రేట్ల పెంపునకు ప్రతిపాదన..

మార్చిలో జరిగిన జీఎస్టీ 39వ సమావేశంలో చాలా వస్తువులపై పన్ను రేట్లలో మార్పులు చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. అనంతరం కరోనా విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్​డౌన్ అమలైంది.

జీఎస్టీ వసూళ్లు భారీగా తగ్గాయి. మార్చికి సంబంధించిన జీఎస్టీ రిటర్నుల దాఖలు గడువును మే 5 వరకు పొడిగించింది ప్రభుత్వం. అంతేకాకుండా ఇప్పటివరకు నెలవారీ వసూళ్ల వివరాలను వెల్లడించలేదు.

Last Updated : May 30, 2020, 8:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.