ETV Bharat / business

ఐదో నెలలోనూ రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు - GST Income of Feb

ఫిబ్రవరిలో జీఎస్టీ రాబడి.. కిందటి నెలతో పోలిస్తే స్వల్పంగా తగ్గి రూ.1.13లక్షల కోట్లకు పరిమితమైంది. జనవరిలో భారీ ఎత్తున రూ.1.20 లక్షల కోట్ల వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది.

GST collections rise 7 pc to Rs 1.13 lakh cr in Feb
ఐదో నెలలోనూ రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
author img

By

Published : Mar 1, 2021, 6:37 PM IST

జీఎస్టీ వసూళ్లు వరుసగా ఐదో నెలలోనూ లక్ష కోట్ల మార్కును దాటాయి. ఫిబ్రవరిలో రూ.1.13 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గతేడాది ఫిబ్రవరితో పోల్చితే.. ఇది 7 శాతం అధికమని పేర్కొంది. అయితే.. జనవరిలో వసూళ్లు రూ.1.20 లక్షల కోట్లకన్నా ఇది తక్కువేనని తెలిపింది.

ఫిబ్రవరి జీఎస్​టీ వసూళ్ల లెక్కలివీ..

  • కేంద్ర జీఎస్​టీ - రూ.21,092 కోట్లు
  • రాష్ట్రాల జీఎస్​టీ -రూ.27,273 కోట్లు
  • సమీకృత జీఎస్​టీ -రూ.55,253 కోట్లు
  • సెస్​- రూ.9,525 కోట్లు

ఈ నెలలో వస్తువుల దిగుమతి ద్వారా వచ్చే ఆదాయం 15 శాతం అధికమని ఆర్థిక శాఖ తెలిపింది. దేశీయ వనరుల ద్వారా వచ్చే ఆదాయం కూడా గతేడాది కంటే ఈ సంవత్సరం 5 శాతం పెరిగినట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి: గృహ రుణాలపై ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.