ETV Bharat / business

'అన్ని రంగాలను ఆదుకునేలా కేంద్రం భారీ ప్యాకేజీ'

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​తో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమందించేందుకు పరిశ్రమలకు త్వరలోనే కేంద్రం భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించనున్నట్లు.. రోడ్డు, రవాణా, జాతీయ రహదారులు మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్​ అర్మాణే తెలిపారు.

author img

By

Published : May 7, 2020, 5:12 PM IST

Updated : May 7, 2020, 5:40 PM IST

corona package
కరోనా ప్యాకేజీ

కరోనాతో కుదేలైన ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం భారీ ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వనున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కేవలం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) మాత్రమే కాకుండా అన్ని రంగాలను ఆదుకునేందుకు సమగ్ర ప్యాకేజీపై కసరత్తు చేస్తున్నట్లు రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్ అర్మాణే తెలిపారు. ప్యాకేజీపై ప్రధాన మంత్రి కార్యాలయం, ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖల మధ్య విస్తృతంగా చర్చలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

భారత వాహన తయారీ సంస్థ సమాఖ్య (సియామ్​) సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా చర్చించిన ఆయన.. ఈ విషయాలు వెల్లడించారు. ఇదే సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్యాకేజీని త్వరలోనే ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

డిమాండ్..

దేశ ఆర్థిక వృద్ధిలో ఎంఎస్​ఎంఈలకు దాదాపు 29 శాతం వాటా ఉంది. దేశ ఎగుమతుల్లో 48 శాతం వీటి ద్వారానే జరుగుతుంటాయి. అయితే కరోనాతో కట్టడికి విధించిన లాక్​డౌన్​తో ఈ పరిశ్రమలపై కోలుకోలేని దెబ్బ పడింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్యాకేజీతో తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. లాక్​డౌన్​తో పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నందుకు ప్యాకేజీ కావాలంటూ.. అన్ని రంగాల నుంచి ప్రభుత్వానికి డిమాండ్లు వస్తున్నాయి.

ఇదీ చూడండి:బ్యాంకులకు ఈఎంఐలు చెల్లించాలా వద్దా?

Last Updated : May 7, 2020, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.