ETV Bharat / business

క్యూ2లోనూ పెరిగిన కేంద్రం అప్పులు - official data on public debt

రెండో త్రైమాసికంలో కేంద్రప్రభుత్వ అప్పులు మరింత పెరిగాయి. సుమారు 5.6శాతం పైగా పెరిగిన రుణాలు రూ. 107.04లక్షల కోట్లుగా ఉన్నట్లు తాజాగా ప్రభుత్వ విడుదల చేసిన నివేదికలో తేలింది.

Govt outstanding debt swells 5.6pc to Rs 107.04 lakh cr in Q2
రెండో త్రైమాసికంలోనూ పెరిగిన కేంద్రం అప్పులు
author img

By

Published : Dec 31, 2020, 3:23 PM IST

Updated : Dec 31, 2020, 3:53 PM IST

2020 రెండో త్రైమాసికంలో ప్రభుత్వ అప్పులు 5.6శాతం పెరిగినట్లు కేంద్రం నివేదిక విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్​ చివరి నాటికి ఈ మొత్తం రూ. 107.04 లక్షల కోట్లకు చేరినట్లు పేర్కొంది. క్యూ1లో వీటి విలువ రూ. 101.3 లక్షల కోట్లుగా నమోదు కాగా.. తాజా లెక్కలతో మరింత పెరిగినట్లు తెలిపింది.

కొవిడ్​ నేపథ్యంలో రాబడిపై ఒత్తిడి పెరగడం వల్ల అప్పులు భారం అధికం అయినట్లు నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ రుణ నిర్వహణ తాజా నివేదిక ప్రకారం.. 2020 సెప్టెంబరు చివరి నాటికి మొత్తం అప్పుల్లో 91.1 శాతం ప్రజా రుణం పేరుకుపోయినట్లు తెలిపింది.

ఈ మూడు నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం రూ.4.20 లక్షల కోట్లకు సెక్యూరిటీ బాండ్లను విడుదల చేసింది. ఈ సెక్యూరిటీలను 38.6శాతం మేర వాణిజ్య బ్యాంకులు, 26.2 శాతం మేర బీమా కంపెనీలు కొనుగోలు చేశాయి. ప్రభుత్వ బాండ్ల ద్వారా ఈ త్రైమాసికంలో సగటున 5.80 శాతం ఆదాయం సమకూరింది. మొత్తమ్మీద ఈ త్రైమాసికంలో ద్రవ్యలోటు రూ.12 లక్షల కోట్లకు చేరుకుంది.

ఇదీ చూడండి: కేంద్ర, రాష్ట్రాల అప్పుల్లో భారీ పెరుగుదల

Last Updated : Dec 31, 2020, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.