వ్యూహాత్మక రంగాలు మినహా.. మిగతా అన్ని విభాగాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) పరిమితిని పెంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే బీమా రంగంలో ఎఫ్డీఐల పరిమితిని 74శాతానికి పెంచింది కేంద్రం. ఇప్పుడు పెన్షన్ రంగానికీ విదేశీ పెట్టుబడుల పరిమితిని పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాల ప్రకారం.. పెన్షన్ రంగంలోకి ఎఫ్డీఐల పరిమితి 74శాతానికి పెంచాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుత ఈ రంగానికి ఎఫ్డీఐల పరిమితి 49 శాతంగా ఉంది.
ఇందుకోసం.. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) యాక్ట్ 2013లో సవరణలు కూడా చేయనుందట కేంద్రం. ఈ చట్ట సవరణ బిల్లు తదుపరి పార్లమెంట్ సమావేశాల్లో ముందుకు రానునట్లు తెలిసింది.
ఇదీ చదవండి:బీమా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం