ETV Bharat / business

ఎల్​టీసీ క్యాష్​ ఓచర్ల​పై ఆర్థిక శాఖ స్పష్టత

ఎల్​టీసీ క్యాష్ ఓచర్ల ప్రయోజనాలకు సంబంధించి ఉద్యోగుల్లో నెలకొన్న సందేహాలను తీర్చేందుకు ఓ కీలక ప్రకటన విడుదల చేసింది ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఒకటికన్నా ఎక్కువ బిల్లులను ఈ ఆఫర్​ కోసం దాఖలు చేయొచ్చా? ఎల్​టీసీలో కొంత వినియోగించుకుంటే.. ఆఫర్​ వర్తిస్తుందా అనే అంశాలపై స్పష్టత ఇచ్చింది.

LTC cash voucher scheme benefit details
ఎల్​టీసీ క్యాష్ క్యాష్ ఓచర్ పథకం పూర్తి వివరాలు
author img

By

Published : Oct 25, 2020, 4:04 PM IST

వినియోగం పెంచి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన ఎల్​టీసీ (లీవ్ ట్రావెల్ కన్సెషన్​) క్యాష్​ ఓచర్​ పథకానికి సంబంధించి మరిన్ని కీలక విషయాలను వెల్లడించింది ఆర్థిక శాఖ. ప్రభుత్వ ఉద్యోగులు తమ పేరు మీద కొనుగోలు చేసిన వస్తువులు, సేవలకు సంబంధించి మల్టిపుల్ (ఒకటికన్నా ఎక్కువ) బిల్లులను ఎల్​టీసీ క్యాష్ ఓచర్ ప్రయోజనాలు పొందేందుకు దాఖలు చేయొచ్చని తెలిపింది.

12 శాతం అంతకన్నా ఎక్కువ జీఎస్​టీ వర్తించే వస్తులు, సేవలను కొనుగోలు చేయడం ద్వారా.. ఉద్యోగులు ఎల్​టీసీ క్యాష్​ ఓచర్​ను ప్రయోజనాన్ని పొందొచ్చని ఈ నెల 12న కేంద్రం ప్రకటించింది. ఈ పథకంపై ఉద్యోగుల్లో నెలకొన్న సందేహాలపై.. ఎఫ్​ఏక్యూ (తరచూ అడిగిన ప్రశ్నలు) జాబితాను విడుదల చేసింది ఆర్థిక శాఖలోని వ్యయాల విభాగం.

LTC cash voucher scheme benefit details
ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్​టీసీ క్యాష్ ఓచర్​ పథకం

ఇప్పటి వరకు ఉద్యోగులు ప్రయాణాలు చేస్తే మాత్రమే ప్రయోజనాలు పొందేవారు. లేదా ఆ మొత్తాన్ని వదులు కోవాల్సి వచ్చేది.

లీవ్ ఎన్​క్యాష్​మెంట్ లేకుండా.. ఎల్​టీసీని ఉపయోగించుకోవచ్చని ఆర్థిక శాఖ తెలిపింది. అయితే ఈ ఖర్చు ఎల్​టీసీ ఛార్జీలకు నిర్దేశించిన నిష్పత్తిలోనే ఉండాలని స్పష్టం చేసింది.

ఎల్​టీసీని సొంతానికి లేదా కుటుంబ సభ్యుల కోసం పాక్షికంగా ఉపయోగిస్తే.. ఈ పథకం వర్తిస్తుందా అన్న ప్రశ్నకు .. 2018-21కి సంబంధించి వినియోగించుకోనూ మిగిలిన మొత్తానికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది.

ఒకటికన్నా ఎక్కువ బిల్లులు ఎల్​టీసీ క్యాష్ ఓచర్ ప్రయోజనాల​ కోసం సమర్పించొచ్చని తెలిపిన ఆర్థిక శాఖ.. కొనుగోలు మాత్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే చేయాలని స్పష్టం చేసింది. వీటికి సంబంధించిన చెల్లింపులు కచ్చితంగా డిజిటల్ రూపంలోనే చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

ఇవీ చూడండి:

పండుగలకు ముందు ఉద్యోగులకు కేంద్రం శుభవార్త

ఉద్యోగులకు ఎల్​టీసీ క్యాష్​ ఓచర్లు, ఫెస్టివల్ అడ్వాన్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.