ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో భారత వృద్ధి రేటు భారీగా పతనమవ్వొచ్చని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్‌మాన్ శాక్స్ తెలిపింది. కీలక ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ 2020-21లో -14.8 శాతం వృద్ధి రేటును నమోదు చేయొచ్చని అంచనా వేసింది. ఇంతకు ముందు అంచనాల్లో ఇది -11.8 శాతంగా ఉండటం గమనార్హం.
సెప్టెంబర్ త్రైమాసికంలో 13.7%; డిసెంబర్ త్రైమాసికంలో 9.8 శాతం చొప్పున క్షీణించొచ్చని అంచనాలను సవరించింది . అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం మాత్రం వేగంగా పుంజుకుని 15.7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా కట్టింది గోల్డ్‌మాన్ శాక్స్.
2020 క్యాలెండర్ ఏడాదిలో భారత్ 11.1 శాతం ప్రతికూల వృద్ధి రేటు సాధించొచ్చని పేర్కొంది.
కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్, దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండటం వంటివి వృద్ధిరేటు ఈ స్థాయిలో పతనానికి కారణమవుతున్నట్లు రేటింగ్ ఏజెన్సీల నివేదికలు అభిప్రాయపడుతున్నాయి.
ఇదీ చూడండి:2021లో భారత వృద్ధి రేటు -10.5%: ఫిచ్