ETV Bharat / business

తగ్గిన పసిడి దిగుమతులు- దిగొచ్చిన వాణిజ్య లోటు - తగ్గిన బంగారం దిగుమతులు

కరెంట్ ఖాతా లోటు (సీఏడీ)పై ప్రభావం చూపే.. పసిడి దిగుమతులు ఈ ఏడాది ఏప్రిల్-జులై మధ్య భారీగా 81.22 శాతం తగ్గాయి. ఇదే సమయంలో వెండి దిగుమతులు కూడా 56.5 శాతం పడిపోయాయి. దీనితో దేశ వాణిజ్య లోటు ఏప్రిల్- జులైలో 13.95 బిలియన్ డాలర్లకు దిగొచ్చింది.

gold imports in July
తగ్గిన పసిడి దిగుమతులు
author img

By

Published : Aug 16, 2020, 8:12 PM IST

బంగారం దిగుమతులు 2020-21 ఏప్రిల్- జులై మధ్య భారీగా తగ్గాయి. నాలుగు నెలల్లో పసిడి దిగుమతులు 81.22 శాతం తగ్గి.. రూ.18,590 కోట్లకు పడిపోయాయి. కరోనా నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులతో డిమాండ్ లేక దిగుమతులు ఈ స్థాయిలో పడిపోయినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇంతకు ముందు 2019-20 ఏప్రిల్-జులై మధ్య బంగారం దిగుమతులు రూ.91,440 కోట్లుగా నమోదు కావడం గమనార్హం.

నాలుగు నెలల కాలంలో పసిడి దిగుమతులు తగ్గినప్పటికీ.. జులై నెలలో మాత్రం 4.17 శాతం పెరిగి.. 1.78 బిలియన్​ డాలర్లుగా ఉండటం గమనార్హం.

పసిడి బాటలోనే వెండి దిగుమతులు కూడా 2020-21 ఏప్రిల్-జులై మధ్య 56.5 శాతం తగ్గి.. రూ.5,185 కోట్లుగా నమోదయ్యాయి.

దిగొచ్చిన వాణిజ్య లోటు..

బంగారం, పసిడి దిగుమతుల్లో తగ్గుదల వల్ల దేశ వాణిజ్య లోటు 2020-21 ఏప్రిల్​-జులైలో 13.95 బిలియన్ డాలర్లకు దిగొచ్చింది. 2019-20 ఏప్రిల్-జులైలో దేశ వాణిజ్య లోటు 59.4 బిలియన్​ డాలర్లుగా ఉంది.

భారత్​దే అగ్రస్థానం..

పసిడి దిగుమతుల్లో భారత్​ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. దేశీయంగా ఆభరణాలకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఏడాదికి సగటున 800-900 టన్నుల వరకు బంగారం దిగుమతి చేసుకుంటుంది భారత్​.

2020-21 ఏప్రిల్​-జులైలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 66.36 శాతం తగ్గి.. 4.17 బిలియన్​ డాలర్లుగా నమోదయ్యాయి.

ఇదీ చూడండి:కొద్ది నెలల్లోనే టాటా చేతికి ఎయిర్ ​ఇండియా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.