పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.145 తగ్గి.. రూ.39,070కి చేరింది. రూపాయి పుంజుకోవడం సహా.. అంతర్జాతీయంగా డిమాండు తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు.
బంగారంతో పాటే వెండి ధరలు నేడు క్షీణించాయి. దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి ధర రూ.315 తగ్గి.. రూ.46,325 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,488 డాలర్ల వద్ద ఉంది. వెండి ఔన్సుకు 17.46 డాలర్లకు చేరింది.
ఇదీ చూడండి: 'ఆర్థిక వృద్ధికి భారత్ చర్యలు బాగున్నాయి. కానీ!'