ETV Bharat / business

గిఫ్ట్ కార్డులు, క్యాష్​ బ్యాక్​లకు జీఎస్​టీ వర్తింపు! - ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీఎస్​టీ వసూళ్ల అంచనా

క్యాష్​-బ్యాక్​, గిఫ్ట్ ఓచర్లు, ఈ-ఓచర్లకు జీఎస్​టీ వర్తిస్తుందని అథారిటీ ఫర్ అడ్వాన్స్​ రూలింగ్ (ఏఏఆర్​) స్పష్టం చేసింది. ఓ గిఫ్ట్ ఓచర్ల సప్లయి కంపెనీ వినతి మేరకు ఈ వివరాలను వెల్లడించింది ఏఏఆర్​.

Good& Service Tax
గూడ్స్ అండ్ సర్వీస్​ ట్యాక్స్​
author img

By

Published : Aug 9, 2021, 7:12 PM IST

కస్టమర్లకు, సప్లయర్లకు ఇచ్చే క్యాష్​-బ్యాక్​, గిఫ్ట్ ఓచర్లను వస్తువులుగా పరిగణించనున్నట్లు అథారిటీ ఫర్ అడ్వాన్స్​ రూలింగ్ (ఏఏఆర్​) స్పష్టం చేసింది. దీనితో వీటికి 18 శాతం జీఎస్​టీ వర్తిస్తుందని వెల్లడించింది.

గిఫ్ట్​, క్యాష్​ బ్యాక్​, ఈ-ఓచర్లు జీఎస్​టీ పరిదిలోకి వస్తాయా? అని బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ప్రీమియర్ సేల్స్​ ప్రమోషన్ లిమిటెడ్​ ఏఏఆర్​ను సంప్రదించగా.. ఈ వివరాలు వెల్లడయ్యాయి.

జీఎస్​టీ వసూళ్లు 26.6 శాతం

2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ.. జీఎస్​టీ వసూళ్ల అదాయపు లక్ష్యంలో..ఇప్పటికే 26.6 శాతం సాధించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు. లోక్​ సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో(ఏప్రిల్​-జూన్​ మధ్య ) రూ.1.67 లక్షల కోట్లకుపైగా జీఎస్​టీ వసూళ్లు నమోదైనట్లు తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీఎస్​టీ వసూళ్ల అంచనా రూ.6.30 లక్షల కోట్లుగా ఉన్నట్లు గుర్తు చేశారు.

ఇదీ చదవండి: 20 బ్రాండ్లపై పీవీ సింధు దావా! కారణమేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.