ETV Bharat / business

'ఆర్​బీఐ అంచనాలకన్నా వేగంగా రికవరీ' - ఆర్​బీఐ వృద్ధి రేటు అంచనాలు

దేశ ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా వృద్ధి రేటు దిశగా పయనిస్తున్నట్లు ప్రముఖ ఆర్థిక నిపుణులు చరణ్ సింగ్ 'ఈటీవీ భారత్​'తో అన్నారు. ఆర్​బీఐ తాజా ఎంపీసీ సమీక్షలో వెల్లడించిన అంచనాలకన్నా వేగంగా ఆర్థిక వ్యవస్థ రికవరీ సాధిస్తున్నట్లు తెలిపారు.

Economic recovery faster than expected
వేగంగా దేశార్థికం రికవరీ
author img

By

Published : Dec 4, 2020, 5:05 PM IST

ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ)లో ఆర్​బీఐ అంచనా వేస్తున్నదానికన్నా వేగంగా దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతున్నట్లు ప్రముఖ ఆర్థికవేత్త చరణ్​ సింగ్ 'ఈటీవీ భారత్​'తో అన్నారు.

Charan Singh, Senior economist
చరణ్​ సింగ్, ప్రముఖ ఆర్థిక నిపుణులు

ఆర్​బీఐ అంచనాలు ఇలా..

శుక్రవారం జరిగిన ఆర్​బీఐ ఎంపీసీ సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్​బీఐ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఇలా చేస్తున్నట్లు తెలిపింది.

ఈ సమావేశంలో వృద్ధి రేటు అంచనాలు మాత్రం సానుకూలంగా ఉన్నట్లు ఆర్​బీఐ వెల్లడించింది. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు క్షీణత అంచనాను.. 9.5-9.8 శాతం(అక్టోబర్​ సమీక్ష అంచనా) నుంచి 7.5 శాతానికి తగ్గించింది.

2020-21 క్యూ3లో వృద్ధి రేటు 0.1 శాతం, నాల్గో త్రైమాసికంలో 0.7 శాతంగా నమోదవ్వొచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది ఆర్​బీఐ.

అయితే ఆర్​బీఐ అంచనాలు బాగున్నా.. భారత్ ఇంకా వేగంగా పుంజుకుంటున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్​)కి చెందిన ఇండిపెండెంట్ ఎవాల్యుయేషన్ ఆఫీస్​ (ఐఈఓ) మాజీ సీనియర్ ఆర్థిక వేత్త, ప్రొఫెసర్ చరణ్​ సింగ్ పేర్కొన్నారు. 2020-21 మొదటి త్రైమాసికంతో పోలిస్తే.. క్యూ2లో పండుగ సీజన్​ వల్ల డిమాండ్ భారీగా పెరిగిందని వివరించారు. రానున్న త్రైమాసికాల్లో ఇంకా వేగంగా వృద్ధి రేటు రికవరీ అవుతుందని అంచనా వేశారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.