ETV Bharat / business

కరెంట్​, గ్యాస్​ విషయంలో సామాన్యుడికి కొత్త శక్తి

విద్యుత్​, ఇంధన రంగంలో సామాన్యులకు మరింత సౌలభ్యం కల్పించే నిర్ణయాలను ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. విద్యుత్తు పంపిణీ వ్యవస్థలో పోర్టబులిటీ విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు. పట్టణ గ్యాస్​ పంపిణీ వ్యవస్థను మరో 100 జిల్లాలకు పెంచుతున్నట్లు తెలిపారు.

Framework soon for electricity consumer
విద్యుత్తు, గ్యాస్​ పంపిణీలో సామాన్యుల ఊరట
author img

By

Published : Feb 1, 2021, 12:36 PM IST

వార్షిక బడ్జెట్​ 2021-22ను పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఈ సందర్భంగా.. విద్యుత్​ రంగంలో గత 60 ఏళ్లల్లో చాలా సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. అదనంగా 139 గిగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచినట్లు తెలిపారు. మరో 2.8 కోట్ల ఇళ్లకు విద్యుత్తు కనెక్షన్లు, 1.41 లక్షల కిలోమీటర్ల ట్రాన్స్​మిషన్​ లైన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

" దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్​ పంపిణీ సంస్థలు ఏకచత్రాధిపత్యాన్ని చలాయిస్తున్నాయి. అది ప్రభుత్వం కావచ్చు, ప్రైవేటు కావచ్చు. ఈ రంగంలో పోటీ వాతావరణాన్ని కల్పించి వినియోగదారులకు తమ పంపిణీ సంస్థను ఎంచుకునే ప్రత్యామ్నాయ అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. ఒకటికన్నా ఎక్కువ విద్యుత్​ పంపిణీ వ్యవస్థలను ఎంచుకునే విధంగా ముసాయిదా రూపొందిస్తున్నాం. వచ్చే ఐదేళ్లకు 3,05,984 కోట్ల వ్యయంతో విద్యుత్​ రంగంలో సంస్కరణలు తెచ్చేలా.. కొత్త పథకాన్ని తీసుకురానున్నాం."

- నిర్మలా సీతారామన్​, ఆర్థిక మంత్రి

పెట్రోలియం, సహజ వాయువు..

కరోనా సంక్షోభ సమయంలోనూ ఎలాంటి ఆటంకం కలగకుండా ఇంధన సరఫరా చేపట్టామన్నారు నిర్మల. ప్రజాజీవితంలో ఈ రంగం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. 8 కోట్ల మంది లబ్ధి పొంది పొందిన ఉచిత గ్యాస్​ కనెక్షన్​ ఉజ్వల పథకాన్ని.. మరో కోటి మందికి పొడిగిస్తున్నట్లు చెప్పారు. నగర గ్యాస్​ పంపిణీ వ్యవస్థలను మరో 100 జిల్లాలకు పెంచుతున్నట్లు తెలిపారు.

జమ్ముకశ్మీర్​లో గ్యాస్​ పైప్​లైన్​ ప్రాజెక్టును చేపడుతున్నట్లు వెల్లడించారు ఆర్థిక మంత్రి. సామాన్యులకు మరింత సౌలభ్యం కల్పించే విధంగా.. అన్ని గ్యాస్​ పైల్​లైన్​ ప్రాజెక్టుల్లో స్వతంత్ర గ్యాస్​ పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.