ETV Bharat / business

ఆ వస్తువుల ధరలు భారీగా తగ్గాయా? నిజమెంత? - జీఎస్​టీ నాలుగు వసంతాలు

వస్తు సేవల పన్ను(జీఎస్​టీ) వల్ల ప్రజలపై పన్నుభారం తగ్గిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. సగటు పన్ను రేటు 11.6 శాతానికి పరిమితమైందని చెప్పింది. నిత్యావసర వస్తువుల ధరలు జీఎస్​టీ ముందురోజులతో పోల్చితే భారీగా దిగొచ్చాయని పేర్కొంది. మరోవైపు.. భారత ఆర్థిక వృద్ధిలో జీఎస్​టీ మైలురాయిగా నిలించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

gst four years, central finance ministry
జీఎస్​టీకి నాలుగేళ్లు
author img

By

Published : Jun 30, 2021, 5:50 PM IST

Updated : Jun 30, 2021, 10:33 PM IST

వస్తు సేవల పన్ను(జీఎస్​టీ) అమల్లోకి వచ్చి నాలుగు వసంతాలు పూర్తైన నేపథ్యంలో.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. నిత్యావసరాలైన తలనూనె, టూత్​పేస్ట్​, వాటర్​ హీటర్స్​ వంటి ధరలు... జీఎస్​టీ ముందురోజులతో పోల్చితే ప్రస్తుతం భారీగా దిగొచ్చాయని తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆమె వరుస ట్వీట్లు చేశారు. పన్ను రేట్లు తగ్గిన వస్తువుల వివరాలను షేర్ చేశారు. జీఎస్​టీ అమల్లోకి వచ్చిన 2017 జులై 1 తర్వాత.. సగటు పన్నురేటు 11.6 శాతానికి పరిమితమైందని పేర్కొన్నారు.

పన్ను రేటు తగ్గిన వివిధ వస్తువులు..

  • సాధారణ వస్తువులైన తలనూనె, టూత్​పేస్ట్​, సబ్బులు వంటి వాటిపై జీఎస్​టీకి ముందు 29.3శాతం పన్ను ఉండగా.. ప్రస్తుతం అది 18శాతంగా ఉంది.
  • గృహోపకరణాలైన రిఫ్రిజరేటర్లు, వాషింగ్​ మెషీన్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు, గ్రైండర్లు, మిక్సర్లు, షేవర్లు, జుట్టు క్లిప్పులు, వాటర్​ హీటర్స్​, హెయిర్​ డ్రయ్యర్స్​, విద్యుత్​ ఇస్త్రీ పెట్టెలు, టీవీలపై అంతకుముందు 31.3 శాతం పన్ను రేటు ఉండగా ప్రస్తతం అది 18శాతంగానే ఉంది.
  • జీఎస్​టీ కంటే ముందు సినిమా టికెట్లపై పన్ను రేటు 35శాతం నుంచి 110శాతంగా ఉండేది. ప్రస్తుత జీఎస్​టీ సమయంలో అది 12శాతం(టికెట్​ ధర రూ.100లోపు ఉంటే), 18 శాతంగా ఉంది.
  • జీఎస్​టీతో వ్యవసాయ రంగానికి మంచి లాభాలు దక్కాయి. ఎరువులపై ఉన్న నికర పన్ను సగానికి సగం తగ్గింది. వ్యవసాయ పరికరాలపై ఉన్న పన్ను రేటు 15%, 18% నుంచి 12శాతానికి తగ్గింది. సేద్య రంగానికి సంబంధించిన ఇతర వస్తువులపై పన్ను రేటు 8శాతం నుంచి 5శాతానికి తగ్గింది.
  • పశుగ్రాసం, చేపల ఆహారం, పౌల్ట్రీ ఆహారంపై జీఎస్​టీలో పన్ను మినహాయింపు దక్కింది. ఈ నాలుగేళ్ల కాలంలో.. జీఎస్​టీ వల్ల దేశీయ మార్కెట్లకు పన్ను రేటు తగ్గి లాభం చేకూరింది. ఫలితంగా అవి అంతర్జాతీయ మార్కెట్లతో పోటీ పడే స్థాయికి చేరుకున్నాయి.
  • 400 వస్తువులు, 80 సేవలపై జీఎస్​టీ రేట్లు తగ్గాయి. జీఎస్​టీ కంటే ముందు.. కేంద్రం, రాష్ట్రాల పన్నులు 31శాతంగా ఉండేవి. అయితే జీఎస్​టీ తర్వాత ఆ పన్ను శాతం తగ్గగా.. పన్ను చెల్లింపుదారుకు మంచి ఉపశమనం లభించింది.

66 కోట్లకుపైగా జీఎస్​టీ రిటర్నులు..

జీఎస్​టీతో తక్కువ పన్ను రేట్ల ఫలితంగా ఇప్పటివరకు 66 కోట్లకుపైగా జీఎస్​టీ రిటర్నులు దాఖలయ్యాయని ట్విట్టర్ వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్త జీఎస్​టీలో.. ఎక్సైజ్​ సుంకం, సేవల పన్ను, వ్యాట్​ వంటి 17 రకాల లెవీ పన్నులు కలిశాయని చెప్పింది. కరోనా మహమ్మారి సమయంలో వర్తకులకు లాభం చేకూర్చేలా జీఎస్​టీ మండలి పలు కీలక సూచనలు చేసిందని వివరించింది.

"జీఎస్​టీ ద్వారా వార్షికాదాయం రూ.40 కోట్లలోపు ఉన్న సంస్థలకు పన్ను మినహాయింపు ఉంది. రూ.1.5 కోట్ల ఆదాయం ఉన్న సంస్థలు.. 1 శాతం పన్నును మాత్రమే చెల్లించే వెసులుబాటు కల్పించాం. సేవల రంగంలో, వ్యాపారాల్లో రూ.20 లక్షలవరకు వార్షికాదాయం ఉన్నావారికి పన్ను చెల్లించనవసరం లేదు. రూ.50 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించే సర్వీస్​ ప్రొవైడర్లకు కేవలం 6శాతం పన్ను చెల్లించే వెసులుబాటు ఉంది." అని కేంద్రం తెలిపింది.

"వినియోగదారుడికి, పన్ను చెల్లింపుదారుడికి స్నేహపూరితమైన విధానం.. జీఎస్​టీ అని నిరూపితమైంది. జీఎస్​టీ కంటే ముందు ఉన్న పన్ను రేట్లు జీఎస్​టీ వచ్చిన తర్వాత తగ్గాయి. ఫలితంగా సకాలంలో పన్ను చెల్లించే వారి సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు 66 కోట్లకు పైగా జీఎస్​టీ రిటర్నులు దాఖలయ్యాయి. దాదాపు 1.3 కోట్ల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు చేరారు."

-కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

క్లిష్టమైన పరోక్ష పన్నుల బాధ నుంచి విముక్తి చేస్తూ... పారదర్శకమైన పన్ను విధానం.. జీఎస్​టీతో సాధ్యమైందని కేంద్రం చెప్పింది. దయార్ధంగా ఉంటూనే ఆర్థిక వృద్ధికి జీఎస్​టీ మార్గం చూపిందని తెలిపింది. కేంద్రం, రాష్ట్రాల అభిప్రాయాల్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు జీఎస్​టీ మండలి ఉపకరించిందని పేర్కొంది. ఇప్పటివరకు 44 సార్లు సమావేశమైందని తెలిపింది.

జీఎస్​టీ పాత్ర కీలకం: మోదీ

భారత ఆర్థిక వృద్ధిలో జీఎస్​టీ మైలురాయిగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం పేర్కొన్నారు. దీని వల్ల వివిధ రకాల వస్తువులపై పన్ను రేట్లు తగ్గాయని చెప్పారు. సాధారణ ప్రజలపై పన్ను భారం తగ్గిందని తెలిపారు. జీఎస్​టీ అమలమలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చూడండి: జులై 1 నుంచి అవి పనిచేయవ్- కొత్త రూల్స్ ఇవే...

ఇదీ చూడండి: 'కొవిడ్​ పరికరాలు, ఔషధాలపై జీఎస్​టీ తగ్గింపు'

Last Updated : Jun 30, 2021, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.