ETV Bharat / business

రవాణాకు పెద్దపీట- బడ్జెట్​లో భారీగా కేటాయింపులు - బడ్జెట్ వార్తలు

ప్రధాని మోదీ మానస పుత్రికలైన భారత్‌ మాల, సాగర్‌ మాల ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ రికార్డుస్థాయిలో నిధులు కేటాయించారు.త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న కేరళ, అసోం, బంగాల్‌, తమిళనాడు రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం కల్పించారు. భవిష్యత్తు అవసరాలే లక్ష్యంగా జాతీయ రైలు ప్రణాళిక రూపొందించామన్న నిర్మలా.. ప్రయాణికుల భద్రతకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు.

public transport
రవాణాకు పెద్దపీట- రూ.18 వేల కోట్లు కేటాయింపు
author img

By

Published : Feb 1, 2021, 8:27 PM IST

ఉపరితల రవాణా, రైల్వేల్లో మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రధాని మోదీ మానసపుత్రికలైన భారత్‌ మాల, సాగర్‌ మాల ప్రాజెక్టులకు రికార్డుస్థాయిలో నిధులు కేటాయించారు. ఉపరితల రవాణా శాఖకు రూ.లక్షా 18వేల 101 కోట్లు ప్రతిపాదించిన మంత్రి ఇందులో రూ.లక్షా 8 వేల 230 కోట్లు మూలధన నిధులు ఉంటాయని చెప్పారు. త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడు, కేరళ, పశ్చిమ బంగాల్, అసోంలో పెద్దఎత్తున ఆర్థిక కారిడార్ల అభివృద్ధికి ప్రతిపాదనలు చేశారు.

దేశంలోని పలు ప్రధాన మార్గాలలో ఎక్స్‌ప్రెస్‌ వేల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో విశాఖపట్నం- రాయచూర్‌ మధ్య 464 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌ వేను వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభిస్తామని చెప్పారు. నాలుగు, ఆరు వరుసల జాతీయ రహదారులపై అత్యాధునిక ట్రాఫిక్‌ నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేస్తామన్నారు.

"5.3 లక్షల కోట్లతో ప్రకటించిన భారత్‌ మాల ప్రాజెక్టులో భాగంగా.... 3.3లక్షల కోట్లతో 13వేల కిలోమీటర్లలో 3వేల 800 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. మార్చి 2022 నాటికి మరో 8,500 కిలోమీటర్లు కలిపి అదనంగా 11వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను పూర్తి చేయనున్నాం."

- నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి

భవిష్యత్‌ అవసరాలే లక్ష్యంగా 2020-30 జాతీయ రైలు ప్రణాళికను రూపొందించినట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రైల్వేలకు లక్షా 10వేల 55 కోట్లు ప్రతిపాదించిన మంత్రి ఇందులో మూలధన వ్యయం లక్షా 7 వేల 100 కోట్లు ఉంటాయని తెలిపారు. 2023 డిసెంబర్‌ నాటికి బ్రాడ్‌గేజ్‌ మార్గాలను పూర్తిగా విద్యుదీకరిస్తామన్న ఆమె.... ఖరగ్‌పూర్‌ నుంచి విజయవాడ వరకూ ఈస్ట్‌కోస్ట్‌ కారిడార్‌ను చేపట్టనున్నట్లు తెలిపారు. దేశంలో మెట్రో రైల్‌ నెట్‌వర్క్‌ విస్తరణకు 18 వేల కోట్లు కేటాయించారు. పట్టణ రవాణాకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపిన నిర్మల సీతారామన్‌...సిటీ బస్సులతోపాటు మెట్రో రైలు సేవలను విస్తరించనున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: పద్దు: ఆరోగ్యం, మౌలిక వసతులకే ప్రాధాన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.