ETV Bharat / business

భారత వృద్ధిరేటు 2020-21లో 1.8శాతమే! - latest india gdp news

వైరస్​ సంక్షోభం నేపథ్యంలో భారత వృద్ధి రేటు అంచనాలను సవరించింది ఫిచ్​ సొల్యూషన్స్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి 1.8 శాతానికే పరిమితమవుతుందని తాజాగా పేర్కొంది సంస్థ.

Fitch Solution cuts India's FY21 GDP growth forecast to 1.8 pc
భారత వృద్ధిరేటు 2020-21లో 1.8శాతమే!
author img

By

Published : Apr 20, 2020, 3:02 PM IST

కరోనా సంక్షోభం దృష్ట్యా భారత వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది ప్రముఖ రేటింగ్​ సంస్థ ఫిచ్​ సొల్యూషన్స్​. 2020-21లో భారత వృద్ధి రేటు 1.8శాతానికి పరిమితమవుతుందని పేర్కొంది. వైరస్​ కారణంగా ఆదాయం కోల్పోతున్నందువల్ల.. ప్రైవేటు వినియోగం తగ్గే అవకాశం ఉన్నట్లు వివరించింది.

గతంలో భారత్​ 4.6 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని ఫిచ్​ సొల్యూషన్స్​ పేర్కొనడం గమనార్హం.

కేంద్రం ఉద్దీపన చర్యలను ఆలస్యంగా ప్రకటించటం వల్ల భారత్​ ఆర్థికంగా మరింత ఒడుదొడుకులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఫిచ్​ సొల్యూషన్స్​ తెలిపింది.

మరోవైపు చైనా 2020 వాస్తవ జీడీపీ అంచనాలను 1.1 శాతానికి సవరించింది. గతంలో 2.6 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని పేర్కొంది. ఈ అంచనాలే ప్రపంచ ఆర్థిక పరిస్థితుల తీవ్రతను తెలియజేస్తున్నాయని ఫిచ్​ సొల్యూషన్స్​ పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.