ETV Bharat / business

2019-20 భారత జీడీపీ వృద్ధి రేటు 4.6 శాతమే! - ఫిచ్​ జీడీపీ అంచనాలు తగ్గింపు

భారత ఆర్థిక వృద్ధి రేటుపై రేటింగ్​ సంస్థ 'ఫిచ్'​ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 4.6 శాతానికి పరిమితం అవుతుందని తాజాగా అంచనా వేసింది.

GDP
2019-20 భారత జీడీపీ వృద్ధి రేటు 4.6 శాతమే!
author img

By

Published : Dec 20, 2019, 6:15 PM IST

దేశంలో ఆర్థిక మందగమనం కొనసాగుతున్న వేళ 2019-20 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు మరింత దిగజారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రముఖ రేటింగ్స్‌ సంస్థ ఫిచ్‌ 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు అంచనాను 4.6 శాతానికి తగ్గించింది. గతంలో 5.6 శాతంగా ఉంటుందని ఈ సంస్థ అంచనా వేసింది. మరో రేటింగ్స్ సంస్థ మూడీస్ 4.9 శాతంగా అంచనా వేయగా.. ఆసియా అభివృద్ధి బ్యాంకు 5.1 శాతంగా ఉంటుందని పేర్కొంది.

రిజర్వు బ్యాంకు అక్టోబర్‌లో 6.1 శాతంగా అంచనా వేసినప్పటికీ, ఇటీవల 5 శాతానికి తగ్గుతుందని ప్రకటించింది. తాజాగా 'ఫిచ్‌' అంచనాలు మరింత తగ్గాయి. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నుంచి రుణ లభ్యత తగ్గడం, వాణిజ్యం మరింత క్షీణించడం వంటి కారణాలతో భారత వృద్ధిరేటు అంచనాలను తగ్గించినట్లు ఫిచ్‌ వెల్లడించింది.

అయితే భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒడుదొడుకుల్లో ఉన్నా.. 2020-21 నాటికి వృద్ధిరేటు 5.6 శాతం, 2021-22 నాటికి 6.5 శాతానికి పెరుగుతుందని ఫిచ్​ ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి:ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవికి ఆనంద్​ మహీంద్రా గుడ్​ బై!

Kolkata, Dec 20 (ANI): Chief Minister of West Bengal Mamata Banerjee on December 20 defended her 'UN referendum on CAA' statement by saying that she only mentioned an "opinion poll", and that she had called Human Rights Commission and United Nations "impartial institutions". "I mentioned only opinion poll. I said Human Rights Commission and UN are impartial institutions," she told reporters in Kolkata after her demand for referendum on CAA and NRC received backlash from the ruling Bharatiya Janata Party (BJP).

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.