కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ), పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) పెంపును జులై 1 నుంచి అమలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ 17 శాతం నుంచి 28 శాతానికి (11 శాతం పెంపు) పెంచుతూ కేంద్ర కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 48.34 లక్షల ఉద్యోగులకు, 65.26 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. పెంచిన డీఏ, డీఆర్ వల్ల కేంద్రంపై రూ.34,401 కోట్ల అదనపు భారం పడనుంది.
ఇదీ చూడండి: 'కరోనాపై కేంద్రానివి తప్పుడు లెక్కలు!'