ETV Bharat / business

మాంద్యంపై యుద్ధానికి కేంద్రం బహుముఖ వ్యూహం

వృద్ధికి దారేది...?: నిర్మల ప్రెస్​మీట్​ లైవ్​
author img

By

Published : Aug 23, 2019, 5:33 PM IST

Updated : Sep 28, 2019, 12:29 AM IST

18:04 August 23

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం సర్వసన్నద్ధమైంది. వృద్ధి మందగమనాన్ని పారదోలి, ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించే లక్ష్యంతో బహుముఖ వ్యూహాన్ని రూపకల్పన చేసింది. సంస్కరణలు కొనసాగిస్తూ, మదుపర్లను ప్రోత్సహిస్తూ రూపొందించిన ఈ ప్రణాళికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిల్లీలో ప్రకటించారు.

'భారత్​ పరిస్థితి ఎంతో మెరుగు'

మాంద్యం భయాలతో తీవ్ర ఆందోళన చెందుతున్న మదుపర్లలో విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు నిర్మల. ఇతర దేశాలతో పోల్చితే భారత్​ పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని స్పష్టంచేశారు. 

'సంస్కరణల రథం ఆగదు...'

కేంద్ర ప్రభుత్వం సంస్కరణలే ప్రధాన అజెండాగా పనిచేస్తుందని స్పష్టంచేశారు నిర్మల. వృద్ధికి ఊతమిచ్చేలా మున్ముందు మరిన్ని సంస్కరణలు అమలుచేస్తామని చెప్పారు.

కీలక నిర్ణయాలు...

ప్రగతి ప్రయాణంలో కీలకమైన సంపద సృష్టికర్తలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని స్పష్టంచేశారు నిర్మల. వారిని దృష్టిలో ఉంచుకునే బడ్జెట్​కు రూపకల్పన చేసినట్లు వివరించారు. 

మదుపర్లు, వ్యాపార వర్గాలకు ప్రోత్సాహం అందించేలా కీలక నిర్ణయాలు ప్రకటించారు నిర్మల. విదేశీ సంస్థాగత మదుపర్లపై అదనపు సర్​ఛార్​ను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. బడ్జెట్​కు ముందు ఉన్న నిబంధనలే అమల్లో ఉంటాయని తేల్చిచెప్పారు.

మరికొన్ని కీలక అంశాలు...

  • పన్ను చెల్లింపుదారులకు వేధింపులు లేకుండా చర్యలు. ఇకపై పన్ను నోటీసులన్నీ కేంద్రీకృత వ్యవస్థ ద్వారానే జారీ.
  • పాత పన్ను నోటీసులు అన్నింటిపై అక్టోబర్ 1 నాటికి నిర్ణయం. కేంద్రీకృత వ్యవస్థ ద్వారా తిరిగి అప్​లోడ్​.
  • ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల మూలధనం. తద్వారా మార్కెట్​లోకి అందుబాటులోకి రానున్న రూ.5లక్షల కోట్ల నగదు.
  • ఆర్బీఐ తగ్గించిన వడ్డీరేటును వినియోగదారులకు బదిలీ చేయాలని బ్యాంకుల నిర్ణయం. 
  • తగ్గనున్న గృహ, వాహన రుణాల భారం.

వృద్ధికి ఊతమిచ్చేలా వచ్చేవారం మరిన్ని ప్రకటనలు చేయనున్నట్లు తెలిపారు నిర్మల.

17:44 August 23

'సంపన్నుల పన్ను' ఎత్తివేత

విదేశీ సంస్థాగత మదుపర్లపై అదనపు సర్​ఛార్జ్​ విధింపునకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్​లో చేసిన ప్రకటనను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ స్పష్టంచేశారు. బడ్జెట్​కు ముందున్న నిబంధనలే అమల్లో ఉంటాయని తేల్చిచెప్పారు.
 
17:35 August 23

భారత్​ పరిస్థితి ఎంతో మెరుగు: నిర్మల

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ దిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారు. వృద్ధి నెమ్మదించడం, అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం వస్తుందన్న అంచనాల నేపథ్యంలో... భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితిపై సవివర ప్రకటన చేస్తున్నారు. 

  • ఆర్థిక మందగమనం ప్రపంచవ్యాప్తంగా ఉంది: నిర్మలా సీతారామన్‌
  • సంపద సృష్టించేవాళ్లను ప్రోత్సహిస్తాం: నిర్మలా సీతారామన్‌
  • సంస్కరణలు అనేవి నిరంతరం జరుగుతాయి: నిర్మలా సీతారామన్‌
  • 2014 నుంచి సంస్కరణలే అజెండాగా పనిచేస్తున్నాం: నిర్మలా సీతారామన్‌
  • గత ఐదేళ్లలో ఎన్నో వాణిజ్య సంస్కరణలు తెచ్చాం: నిర్మలా సీతారామన్‌
  • పన్ను విధానాల్లో సంస్కరణలు తీసుకువచ్చాం: నిర్మలా సీతారామన్‌
  • మిగతా దేశాలతో పోలిస్తే మనదేశ పరిస్థితి మెరుగ్గా ఉంది: నిర్మలా సీతారామన్‌
  • భారత్‌ త్వరితంగా వృద్ధిరేటు నమోదు చేస్తోంది: నిర్మలా సీతారామన్‌
  • వాణిజ్యయుద్ధ ప్రభావం ప్రపంచదేశాలపై ఉంది: నిర్మలా సీతారామన్‌ 
  • ఎల్లుండి జీఎస్టీ అధికారులతో సమావేశం: నిర్మలా సీతారామన్‌
  • జీఎస్‌టీని మరింత సులభతరం చేస్తాం: నిర్మలా సీతారామన్‌
  • భద్రతను బలోపేతం చేసే విధానాలు దసరా నుంచి ప్రారంభం: నిర్మలా సీతారామన్‌
  • పన్నుల వసూళ్లలో ఎవరికీ ఇబ్బందులు ఉండవు: నిర్మలా సీతారామన్‌
  • ప్రపంచ జీడీపీ 3.2 శాతం నుంచి మరింత పతనం అవుతోంది: నిర్మలా సీతారామన్‌
  • 2014 నుంచి మేం తెచ్చిన సంస్కరణలతో మనదేశం సురక్షిత స్థితిలో ఉంది: నిర్మల

17:32 August 23

'ఆందోళనలు అవసరంలేదు'

దేశ ఆర్థిక పరిస్థితిపై ఆందోళనలు అవసరంలేదని భరోసా ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి. ఇతర దేశాలతో పోల్చితే భారత్​ ఎంతో మెరుగైన స్థితిలో ఉందని స్పష్టంచేశారు. 

17:22 August 23

వృద్ధికి దారేది...?: నిర్మల ప్రెస్​మీట్​ లైవ్​

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ దిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారు. వృద్ధి నెమ్మదించడం, అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం వస్తుందన్న అంచనాల నేపథ్యంలో నిర్మల ఎలాంటి ప్రకటన చేస్తారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
Intro:Body:Conclusion:
Last Updated : Sep 28, 2019, 12:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.