ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 4.5 శాతం మేర క్షీణించొచ్చని తమ సర్వేలో వెల్లడైనట్లు తెలిపింది ఫిక్కీ. ఈ ఏడాది జనవరిలో వేసిన అంచనా ప్రకారం జీడీపీ వృద్ధి 5.5 శాతం. అయితే కొవిడ్-19 వల్ల ఆర్థిక, ప్రజల ఆరోగ్య పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయని పేర్కొంది. జీడీపీ కనిష్ఠంగా -6.4 శాతంగా, గరిష్ఠంగా 1.5 శాతం మేర నమోదవ్వచ్చనే అంచనాలు వ్యక్తమయ్యాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 14.2 శాతం క్షీణించొచ్చని ఫిక్కీ సర్వేలో అంచనా వేసింది. ఈ సమయంలో జీడీపీ కనిష్ఠంగా -25 శాతం, గరిష్ఠంగా -7.4 శాతంగా నమోదవ్వచ్చని తెలిపింది.
పరిశ్రమలు, సేవా రంగం ఈ ఆర్థిక సంవత్సరంలో వరుసగా 11.4 శాతం, 2.8 శాతం క్షీణతను నమోదు చేయొచ్చని ఫిక్కీ పేర్కొంది.
ఇదీ చూడండి:రిలయన్స్ ఏజీఎంలో మరిన్ని భారీ ప్రకటనలు!