ETV Bharat / business

ఎఫ్​డీఐల వెల్లువ- 9 నెలల్లో 40% వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 40 శాతం పెరిగి, 51.47 బిలియన్ డాలర్లకు చేరాయని కేంద్రం వెల్లడించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 37 శాతం, డిసెంబర్ నెలలో 24 శాతం ఎఫ్​డీఐలు పెరిగాయని తెలిపింది.

FDI rises 40 pc to USD 51.47 bn in Apr-Dec 2020-21: Govt data
ఎఫ్​డీఐల వెల్లువ- 9 నెలల్లో 40 శాతం జంప్
author img

By

Published : Mar 4, 2021, 5:12 PM IST

భారత్​లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్​డీఐ) గణనీయంగా పెరుగుతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో ఈక్విటీ ఎఫ్​డీఐలు 40 శాతం పెరిగి.. 51.47 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

2019-20 తొలి తొమ్మిది నెలల(55.14 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే.. 2020-21లో 22 శాతం అధికంగా(67.54 బిలియన్ డాలర్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేశాయి. 2020-21 మూడో త్రైమాసికం(అక్టోబర్-డిసెంబర్)లో ఎఫ్​డీఐలు 37 శాతం పెరిగ్గా... డిసెంబర్​లో ఎఫ్​డీఐలు ఏకంగా 24 శాతం వృద్ధి చెందాయి.

గత ఆరున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, సులభతర వాణిజ్యం వంటి చర్యలు ఎఫ్​డీఐలు పెరిగేందుకు దోహదం చేశాయని వాణిజ్య, పరిశ్రమల శాఖ పేర్కొంది.

ఇదీ చదవండి: భద్రతా దళాల అధినేతల సదస్సుకు మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.