ETV Bharat / business

ఎఫ్​డీఐలు 19శాతం జంప్- గుజరాత్​ టాప్​

author img

By

Published : May 24, 2021, 6:09 PM IST

కరోనా సంక్షోభం ఉన్నా 2020-21లో భారత్​కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబుడులు వెల్లువెత్తాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2019-20తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం ఎఫ్​డీఐలు 19శాతం పెరిగినట్లు వెల్లడైంది. అత్యధిక ఎఫ్​డీఐలు సాధించిన రాష్ట్రాల్లో గుజరాత్ అగ్ర స్థానంలో నిలిచింది.

FDIs rise in FY21
భారత్​కు ఎఫ్​డీఐల వెల్లువ

గత ఆర్థిక సంవత్సరం(2020-21) భారత్​కు 59.64 బిలియన్​ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్​డీఐ) వచ్చినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ మొత్తం 19శాతం ఎక్కువని వెల్లడించింది. సరళమైన విధానాలు, సులభతర వాణిజ్యం వంటివి ఎఫ్​డీలు పెరిగేందుకు కారణమైనట్లు పేర్కొంది.

ఈక్విటీ, రీ-ఇన్వెస్టెడ్​​ ఎర్నింగ్స్, మూలధన పెట్టుబడులు అన్ని కలిపి గత ఏడాది భారత్​కు వచ్చిన ఎఫ్​డీఐలు 81.72 బిలియన్​ డాలర్లుగా తెలిపింది వాణిజ్య మంత్రిత్వ శాఖ. 2019-20లో నమోదైన 74.39 బిలియన్​ డాలర్ల ఎఫ్​డీఐలతో పోలిస్తే.. ఈ మొత్తం 10 శాతం ఎక్కువ.

ఏ రంగానికి ఎంత?

గత ఆర్థిక సంవత్సరం మొత్తం ఎఫ్​డీఐలలో అత్యధికంగా 44శాతం కంప్యూటర్ సాఫ్ట్​వేర్​, హార్డ్​వేర్​ రంగానికే వచ్చినట్లు వాణిజ్య శాఖ పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో కన్​స్ట్రక్షన్​ (13 శాతం), సేవా రంగం (8 శాతం) ఉన్నాయి.

గుజరాత్​ అగ్రస్థానం..

రాష్ట్రాల వారీగా చూస్తే.. 37 ఎఫ్​డీఐలు సాధించి గుజరాత్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (27 శాతం), కర్ణాటక (13 శాతం) ఉన్నాయి.

ఇదీ చదవండి:పసిడి బాండ్ల ఇష్యూ షురూ- గ్రాముకు ఎంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.