ETV Bharat / business

నాన్న నుంచి ఈ ఆర్థిక పాఠాలు నేర్చుకున్నారా? - ఆర్థిక ప్రణాళిక సలహాలు

'ఫాదర్స్ డే' అనగానే నాన్నకు శుభకాంక్షలు చెప్పడం మాత్రమే కాదు. ఈ సారి కొత్తగా ఏదైనా నేర్చుకుందాం. ఆర్థిక పరమైన విషయాల్లో నాన్న నుంచి గ్రహించాల్సిన ఆరు ముఖ్యమైన ఆర్థిక సూత్రాలు మీ కోసం.

lessons to learn on Father's day
ఫాదర్స్​డే ఆర్థిక పాఠాలు
author img

By

Published : Jun 21, 2020, 1:03 PM IST

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు విధించిన లాక్​డౌన్​తో మన జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఎన్నో పాఠాలు నేర్పింది ఈ పరిస్థితి. మా నాన్నతో ఇటీవల మాట్లాడుతూ.. ఆర్థిక పరమైన అంశాలను చర్చించాను.

ఈ సంభాషణలో నా జీవితాన్ని ప్రభావితం చేసే చాలా విషయాలు తెలుసుకున్నాను. అలా నేను తెలుసుకున్న ఆరు ముఖ్యమైన ఆర్థిక సూత్రాలు మీ కోసం..

1. అవసరాలు, కోరికల మధ్య భేదం తెలుసుకోవడం..

"నేను నెలకు కేవలం రూ.800తో నా వృత్తిజీవితం ప్రారంభించాను. అప్పుడు పక్కన మీ అమ్మ, నా భుజాలపై నువ్వు ఉన్నావు" అంటూ మా నాన్న గంభీర ధ్వనితో చెబుతుంటే నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

నాన్న చెప్పిన ఈ మాటలతో.. ఆశలు, అవసరాలకు మధ్య తేడాను గ్రహించి కష్టకాలంలోనూ జీవితాన్ని ఎలా అస్వాదించాలో తెలుసుకున్నాను.

ప్రతి ఒక్కరూ.. ఎదుగుతున్న దశలో అనవసర ఖర్చులు చేయించే కోరికలను పక్కనబెట్టి.. అవసరాలపై మాత్రమే దృష్టి పెట్టాలని ఆయన చెబుతుంటారు.

ఆ మాటలు ద్వారా ఎదిగే దశలో ఆర్థిక పరమైన నిర్ణయాలు ఎలా ఉండాలో మా నాన్న ద్వారా నేను తెలుసుకున్నాను.

2. ఆరోగ్యం విషయంలో అలసత్వం వద్దు..

మా నాన్న ఉద్యోగం మారడం వల్ల ఆదాయం పెరిగినప్పటికీ.. పెద్దగా ఆస్తులు మాత్రం కూడబెట్టుకోలేదు. ఈ సమయంలో మన తిండి ఖర్చులు కూడా తగ్గించుకుందామా నాన్న? అన్న నా ప్రశ్నకు.. ఈ రోజు మనం సరైన తిండి తినకుండా పొదుపు కోసం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే.. తర్వాత ఆస్పత్రి ఫీజుల రూపంలో ఇంతకు రెండింతలు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని చెప్పారు.

నాన్న వృత్తి జీవితం ప్రారంభ దశలో ఉన్నా.. పిల్లల ఆరోగ్యంపై మాత్రం అలసత్వం చూపరు. ఆదాయం తక్కువగా ఉన్నా సరే.. ఖర్చుకు వెనకాడకుండా అవసరమైన వ్యాక్సిన్​లు ఇప్పిస్తారు.

పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం కూడా వారి కలలు నెరవేర్చడంలో ఒక భాగమని ఆయన చెబుతుంటారు.

3. క్రమబద్ధమైన పెట్టుబడి..

పిల్లలు పుట్టినప్పటి నుంచే వారి కోసం నెలకు రూ.500 చొప్పున క్రమమైన పెట్టుబడి పెడితే.. ఏడాదికి 12 శాతం వడ్డీ వస్తుంది. ఇలా మీ పిల్లలకు 25 ఏళ్లు వచ్చే వరకు పెట్టుబడి పెట్టి.. ఆ తర్వాత పదవీ విరమణ వయస్సు వచ్చే వరకు ఆ పెట్టుబడిని కొనసాగించమని పిల్లలకు చెప్పండి. అలా చేస్తే వారి రిటైర్మెంట్​ సయమానికి దాదాపు రూ.5,02,09,428 చేతికి అందుతుంది. మీరు పిల్లలకు బహుమతి ఇవ్వాలనుకుంటే.. ఇంతకంటే ఉత్తమమైనది ఇంకేం ఉంటుంది.

invest in systematic manner
క్రమబద్ధమైన పెట్టుబడితో బంగారు భవిష్యత్

4. కనీస పెట్టుబడి అలవాటు..

మా నాన్న జీవితాన్ని మార్చిన సలహాలను ఆయన ఎప్పటికీ మరిచిపోరు. ఆయన జీవితంలో మొదటి సారిగా తీసుకున్న సలహాను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

"ఏడాదికి కనీసం ఒకసారైనా.. పుట్టిన రోజు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో క్యాపిటల్ ఇన్వెస్ట్​మెంట్​ చేయడం." అనే విషయం అందులో ఒకటని చెబుతుంటారు.

బంగారం వంటి క్యాపిటల్ అసెట్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. మీరు రూ.100 సంపాదిస్తే కనీసం రూ.5 అయినా సరే కచ్చితంగా పొదుపు చేయండి.

minimum invest
కనీస పొదుపు

5. ప్రాక్టికల్​గా అప్పుల నిర్వహణ..

కొన్ని సార్లు మనం సానుకూల దృక్పథం కన్నా.. ప్రాక్టికల్​గా ఉండాలని మా నాన్న సూచిస్తుంటారు. ముఖ్యంగా అప్పుల విషయంలో దీని అవసరాన్ని ఆయన వివరంగా చెప్పారు.

మా నాన్నకు వచ్చే పరిమిత జీతంతో అప్పులను ఎలా క్రమబద్ధంగా నిర్వహిస్తుంటారో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. అందుకే భవిష్యత్​ ఆదాయం, ఖర్చులను అంచనా వేశాకే.. గృహ రుణాల వంటివి తీసుకోవాలని సలహా ఇస్తుంటారాయన.

6. నిజమైన ఆనందం..

"సేవ అనేది కేవలం డబ్బుతోనే కాదు, మనస్సుతో కూడా చేయాలి" అని మా నాన్న చెబుతుంటారు. ఓ స్వచ్ఛంద సంస్థలో క్రియాశీల సభ్యుడిగా ఉంటూ ఆర్థిక పరంగా, వ్యక్తిగతంగా సేవ చేస్తే లభించే సంతోషం గురించి ఆయన చెబుతుంటారు.

నాన్న వేసుకున్న ప్రణాళికలు విజయవంతం అవ్వాలంటే.. ఆయనకు సహాయం చేసి తోడుగా ఉండటం కుటుంబ సభ్యులందరి బాధ్యత. ఎందుకంటే కుటుంబ పెద్దగా ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలనుకోవడం తప్ప తండ్రిగా ఆయనకు పెద్దగా కోరికలు ఉండవు.

true happiness
సేవలోనే నిజమైన ఆనందం

ఇలా జీవితాంతం మన ఆర్థిక గురువుగా ఉంటూ.. ఎప్పుడు మన సంతోషం కోసం కష్టపడే నాన్నకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఈ 'ఫాదర్స్​ డే' జరుపుకుందాం.

  • ఆందరికీ 'ఫాదర్స్​ డే' శుభాకాంక్షలు

(రచయిత:వైశాలీ సింగ్, పర్సనల్ ఫినాన్స్​ నిపుణురాలు)

ఇదీ చూడండి:గడువు ముగుస్తోంది.. ఈ పనులు పూర్తి చేశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.