ETV Bharat / business

ఎగుమతుల్లో జోష్​- జూన్​లో 47% వృద్ధి - కరోనా మధ్య భారత వాణిజ్య ఎగుమతులు

ఈ ఏడాది జూన్​లో భారత ఎగుమతులు 47శాతం వృద్ధి చెంది 3,246 కోట్ల డాలర్లకు చేరాయి. వాజిజ్య లోటు 41 శాతం తగ్గి 940 కోట్ల డాలర్లకు చేరింది. దిగుమతులు 96.33 శాతం పెరిగి 4,186 కోట్ల డాలర్లకు చేరాయి.

Exports of inida in 2021 june
జూన్​ నెలలో భారత ఎగుమతులు
author img

By

Published : Jul 3, 2021, 5:25 AM IST

Updated : Jul 3, 2021, 6:56 AM IST

ఈ ఏడాది జూన్​లో దేశ ఎగుమతులు 47.34 శాతం వృద్ధి చెంది 3,246 కోట్ల డాలర్లకు చేరాయి. 2019 జూన్​లో ఎగుమతులు 2,500 కోట్ల డాలర్లు కాగా, 2020 జూన్​లో 2,200 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్​లో 3,100 కోట్ల డాలర్లుగా, మేలో 3,227 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. ఇక జూన్​లో దిగుమతులు 96.33 శాతం పెరిగి 4,186 కోట్ల డాలర్లకు చేరాయి. 2019 జూన్​లో 4,100 కోట్ల డాలర్లుగా, 2020 జూన్​లో 2,132 కోట్ల డాలర్లుగా దిగుమతులు ఉన్నాయి.

2020 జూన్​లో 71 కోట్ల డాలర్ల వాణిజ్య మిగులు లభించింది. 2019 జూన్ నాటి వాణిజ్యలోటు 1,600 కోట్ల డాలర్లతో పోల్చినా, గత నెలలో వాణిజ్య లోటు 41.26 శాతం తగ్గి 940 కోట్ల డాలర్లకు చేరింది.

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) ఏప్రిల్- జూన్​లో ఎగుమతులు రికార్డు స్థాయిలో 9,536 కోట్ల డాలర్లకు వృద్ధి చెందాయి. 2020-21 ఇదే కాలంలో ఇవి 5,144 కోట్ల డాలర్లే. ఇదే సమయంలో దిగుమతులు సైతం 6,065 కోట్ల డాలర్ల నుంచి 12,614 కోట్ల డాలర్లకు పెరిగాయి.
  • జూన్​లో చమురు దిగుమతులు 1,068 కోట్ల డాలర్లకు పెరిగాయి. 2020 జూన్​లో ఇవి 497 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్- జూన్​లో 1,312 కోట్ల డాలర్ల నుంచి 3,100 కోట్ల డాలర్లకు చేరాయి.
  • ఏప్రిల్-జూన్​లో ఇంజినీరింగ్, పెట్రోలియం, ఔషధ ఎగుమతులు వరుసగా 2,590 కోట్ల డాలర్లు, 1,290 కోట్ల డాలర్లు, 580 కోట్ల డాలర్లకు చేరాయి.

ఇదీ చూడండి: బెస్ట్ క్వాలిటీ వీడియోలు వాట్సాప్​లో పంపెయ్యండిలా..

ఇదీ చూడండి: Airtel: మొబైల్‌+ డీటీహెచ్‌+ ఫైబర్‌.. ఒకే ప్లాన్‌లో అన్నీ!

Last Updated : Jul 3, 2021, 6:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.