భారత ఎగుమతులు నవంబర్లో 0.34 శాతం తగ్గాయి. వీటి విలువ 25.98 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దిగుమతులు 38.11 బిలియిన్ డాలర్లకు తగ్గినట్లు ఈ గణాంకాల్లో వెల్లడైంది.
నవంబర్లో వాణిజ్య లోటు.. 12.12 బిలియన్ డాలర్లకు చేరింది.
గతేడాది నవంబర్లో భారత ఎగుమతుల విలువ 26.07 బిలియన్ డాలర్లుగా ఉండగా.. దిగుమతుల విలువ 43.66 బిలియన్ డాలర్లుగా ఉంది.
చమురు దిగుమతుల విలువ నవంబర్లో 11.06 బిలయన్ డాలర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 18.17 శాతం తక్కువ.
బంగారం దిగుమతుల విలువ 2.94 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు అంచనా. ఇంతకముందుతో పోలిస్తే ఇది 6.7 శాతం ఎక్కువ.
ఇదీ చూడండి:'జీఎస్టీ రేట్ల పెంపుపై అసలు చర్చే జరగలేదు'