ETV Bharat / business

'జీడీపీలో 20% మేర భారత​ ఎగుమతులు' - exports of india after covid

దేశ జీడీపీలో 20శాతం మేర భారత ఎగుమతులు ఉన్నాయని ​ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రానున్నరోజుల్లో ఇవి మరింత పెరుగుతాయని చెప్పారు.

modi on exports
ఎగుమతులపై మోదీ
author img

By

Published : Aug 6, 2021, 8:18 PM IST

Updated : Aug 6, 2021, 9:34 PM IST

దేశ జీడీపీలో 20శాతం మేర ఎగుమతులు జరిగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రానున్న రోజుల్లో ఇవి మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిరంగంలో విశ్వవిజేతలను తయారు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇండియన్ మిషన్స్​ అండ్​ ఎక్పోర్ట్స్​ ప్రమోషన్​ కౌన్సిల్​ సమావేశానికి ఆయన వర్చువల్​గా హాజరయ్యారు.

"ఎమర్జెన్సీ క్రెడిట్​ లైన్​ గ్యారంటీ పథకం, ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం వల్ల పరిశ్రమలకు ఊతం అందింది. తద్వారా దేశీయ ఉత్పత్తి పెరిగింది. రెట్రోస్పెక్టివ్​ పన్నును తొలగించేలా నిర్ణయం తీసుకోవడం.. ఎగుమతులను ప్రోత్సహించడంపై మా నిబద్ధతకు సాక్ష్యం."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

భారత ఉత్పత్తులకు సరికొత్త మార్కెట్​ లభించేలా.. విదేశాల్లో భారత దౌత్య విధానాలు ఉపకరిస్తున్నాయని మోదీ చెప్పారు. కొవిడ్​ అనంతరం ఏర్పడ్డ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమలు, ఎగుమతిదారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పిలుపునిచ్చారు. 400బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని సాధించేందుకు కొత్త గమ్యస్థానాలను ఏర్పరుచుకోవాలని చెప్పారు. ఉత్పత్తిలో పెరుగుదల, లాజిస్టిక్స్​ ధర, దేశీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్​ దేశీయ ఎగుమతుల పెరుగుదలకు అండగా నిలుస్తాయని పేర్కొన్నారు.

Last Updated : Aug 6, 2021, 9:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.