ETV Bharat / business

హోల్​సేల్ ధరలు తగ్గినా.. రిటైల్​ రేట్లకు రెక్కలు ఎందుకు? - చిల్లర ధరల ద్రవ్యోల్బణం అంటే ఏమిటి

ఇటీవల కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్​లో హోల్​ సేల్ ద్రవ్యోల్బణం -1.8 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో రిటైల్ ద్రవ్యోల్బణం మాత్రం 6.09 శాతానికి చేరింది. హోల్​ సేల్ ధరలు తగ్గినా ఆ ప్రభావం వినియోగదారులకు అందకపోడవం వల్ల ఈ స్థాయిలో వ్యత్యాసం ఏర్పడింది. మరి ధర తగ్గుదల ఎందుకు బదిలీ కాలేదు? హోల్​ సేల్​-రిటైల్ మార్కెట్ల మధ్య వ్యత్యాసానికి కారణాలేమిటి?

why retail inflation going up
రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగేందుకు కారణాలు
author img

By

Published : Jul 18, 2020, 7:38 PM IST

2020 జూన్​లో రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 6.09 శాతం. హోల్​ సేల్ ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) మాత్రం -1.81 శాతం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలివి.

క్లుప్తంగా చెప్పాలంటే హోల్​ సేల్ ధరల్లో హెచ్చుతగ్గులను సూచించే సూచీనే డబ్ల్యూపీఐ, వినియోగదారు ధరల్లో హెచ్చు తగ్గులను సూచించేదే సీపీఐ. ఈ గణాంకాలు ప్రతి నెల(అంతకుముందు నెలవి) వస్తాయి.

అలా జరగలేదే..

సాధారణంగా హోల్​ సేల్ ధరలు పెరిగితే.. ఆ ప్రభావం రిటైల్ ద్రవ్యోల్బణంపై పడుతుంది. అప్పుడు రిటైల్ ధరలు కూడా పెరుగుతాయి. అయితే ఈ సారి అందుకు విరుద్ధంగా.. డబ్లూపీఐ తగ్గినా.. సీపీఐ మాత్రం భారీగా పెరిగింది.

సీపీఐ ఆధారంగా చేసుకునే రిజర్వు బ్యాంక్ రేపో రేటు (బ్యాంకులకు ఇచ్చే అప్పులపై వడ్డీ)ను నిర్ణయిస్తుంది. ఆర్​బీఐ నిర్ణీత రిటైల్ ద్రవ్యోల్బణం 4±.2 శాతంగా ఉండాలి. గరిష్ఠ ద్రవ్యోల్బణం ఆరు శాతానికి మించకూడదు. జూన్ నెలలో ఈ స్థాయిని దాటి ధరలు పెరిగాయి.

ఈ సారి ఎందుకీ వ్యత్యాసం..

టోకు ద్రవ్యోల్బణం తగ్గినా.. రిటైల్ ద్రవ్యోల్బణం పెరగటం అనేది హోల్​ సేల్ ధరల్లో తగ్గుదల.. వినియోగదారులకు బదిలీ కాలేదన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. దీనితోపాటు మరిన్ని అంశాలు కూడా రెండు ద్రవ్యోల్బణాల్లో వ్యత్యాసానికి కారణం అవుతున్నాయి.

వెయిటేజీలో తేడా

సూచీలను లెక్కించేందుకు వివిధ అంశాలకు వెయిటేజీ ఇస్తారు.

ఫుడ్ అండ్ బేవరేజెస్​కు సీపీఐలో 54.2 శాతం వెయిట్ ఉంది. అదే టోకు ధరల సూచీలో కేవలం 15.3 శాతం వెయిట్ ఉంది. ఆహార పదార్థాల ధరల పెరుగుదల వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం, టోకు ధరల ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ పెరుగుతుంది.

డబ్ల్యూపీఐలో తయారీ వస్తువుల వెయిట్ అత్యధిగంగా 64.23 శాతంగా ఉంది.

సీపీఐలో ఫుడ్ అండ్ బేవరేజెస్ తర్వాత సేవలకు (ఆరోగ్యం, రవాణా, కమ్యూనికేషన్స్, విద్యా, పర్సనల్ కేర్‌) ఎక్కువ వెయిట్ (27 శాతం) ఉంది. ఇంధనం, విద్యుత్​కు డబ్ల్యూపీఐలో 13.15 శాతం ఉండగా... సీపీఐలో 7.94 శాతం వెయిట్ మాత్రమే ఉంది. వెయిటేజీల్లో తేడాల వల్ల కూడా.. ద్రవ్యోల్బణం గణాంకాల్లో తేడాలు వచ్చినట్లు తెలుస్తోంది.

సంక్లిష్ట పరిస్థితులు..

మార్కెట్​లో ప్రస్తుతం నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులు కూడా టోకు ద్రవ్యోల్బణం, రిటైల్ ద్రవ్యోల్బణాల మధ్య భారీ వ్యత్యాసానికి కారణమైనట్లు తెలుస్తోంది.

కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​తో రవాణాపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో హోల్​ సేల్ ధరల్లో తగ్గుదల ప్రభావం రిటైల్ మార్కెట్​కు బదిలీ అయ్యేందుకు సమయం పట్టొచ్చని అంటున్నారు విశ్లేషకులు. గత నెలలో ఈ బదిలీ కాలేదంటే.. తర్వాతి నెలల్లో ఆ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.

సరఫరా తగ్గిపోవటం వల్ల వినియోగదారులు అధిక ధరలు చెల్లిస్తున్నప్పటికీ.. రైతులు సరైన ధరలు పొందడం లేదని తరచూ వింటూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో టోకు ధరల, రిటైల్ ధరల విషయంలో వ్యత్యాసాలు ఏర్పడి ఉండచ్చని అంటున్నారు విశ్లేషకులు.

విధాన నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో!

జూన్ ద్రవ్యోల్బణం లెక్కలు విధాన నిర్ణేతలకు ఆందోళన గురిచేసేవే. రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు సీపీఐని పరిగణనలోకి తీసుకుంటుంది.

టోకు ధరల ద్రవ్యోల్బణం నెగెటివ్​లోకి వెళ్లటం ఇంకా ఆందోళన కలిగించేది. ఇది తయారీ రంగం బలహీనం కావటాన్ని సూచిస్తోంది. దీని వల్ల వడ్డీ రేట్లు మరింత తగ్గించాల్సి ఉంటుంది. ఇటీవల కొన్ని నెలలుగా వృద్ధిని పెంచేందుకు రిజర్వు బ్యాంకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీనికోసం వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తోంది. మరి ఇప్పుడు నెలకొన్న సంక్షోభ పరిస్థితుల వల్ల భవిష్యత్​లో ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

ఇదీ చూడండి:కరోనా వేళ భారత్​లోకి విదేశీ పెట్టుబడుల వెల్లువ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.