ETV Bharat / business

బడ్జెట్​ 2021: వైద్య రంగానికే పెద్ద పీట! - బడ్జెట్ వార్తలు

కరోనా మహమ్మారి వల్ల చాలా రంగాలు కుదేలైతే.. వైద్య, ఆరోగ్య రంగంలో మాత్రం లోటుపాట్లు బయటపడ్డాయి. ఇలాంటి ప్రత్యేక పరస్థితుల నడుమ కేంద్రం సోమవారం బడ్జెట్​ ప్రవేశపెట్టనుంది. మరి ఈసారి బడ్జెట్​లో వైద్య ఆరోగ్య రంగానికి కేటాయింపులు ఎలా ఉండొచ్చు? విశ్లేషకులు ఏమంటున్నారు?

bonanza for health sector in union budget
హెల్త్​ కేర్ రంగానికి భారీ కేటాయింపులు
author img

By

Published : Feb 1, 2021, 7:31 AM IST

'ఆరోగ్యమే మహా భాగ్యం' అనే విషయాన్ని కరోనా మహమ్మారి ప్రపంచానికి మరోసారి స్పష్టం చేసింది. దీనితో పాటు మన దేశ హెల్త్​కేర్​ రంగంలో లోటుపాట్లను ఎత్తి చూపింది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్​లో 'ఆరోగ్య రంగానికి' భారీ బొనాంజ ప్రకటించొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.

ఈ విషయంపై వైద్యారోగ్య రంగ విశ్లేషకులు 'ఈటీవీ భారత్​'తో ప్రత్యేకంగా మాట్లాడారు.

కరోనా వల్ల భారత్ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేయడం, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం వంటి విషయాల కోసం ఈ సారి బడ్జెట్​లో కేంద్రం భారీగా కేటాయింపులు చేయొచ్చని వారంటున్నారు. ఆరోగ్య రంగ కేటాయంపులు జీడీపీలో 1.3 శాతం నుంచి 5 శాతానికి పెరగొచ్చని భావిస్తున్నారు.

గత ఏడాది కేటాయింపులు ఇలా..

గత ఏడాది బడ్జెట్​లో ఆరోగ్య రంగానికి రూ.69 వేల కోట్లు కేటాయించింది కేంద్రం. అదనంగా రూ.35 వేల కోట్లను పోషకాహార సంబంధి కార్యక్రమాల కోసం ప్రతిపాదించింది.

"అత్యంత చౌకగా ఆరోగ్య బీమా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని తీసుకురావాలి. మేము పరిశోధక, ఉత్పాదక విభాగాన్ని అభివృద్ధి చేస్తున్నాం. వీటి ద్వారా తక్కువ ధరకే మంచి ఔషధాలు ఇవ్వగలుగుతాం."

-డాక్టర్ అర్వింద్ గార్గ్​, న్యూరాలజిస్ట్,​ ఆరోగ్య రంగ నిపుణులు

దిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొహల్లా క్లీనిక్​ విధానాన్ని కేంద్రం కూడా అందిపుచ్చుకోవాలని సూచిస్తున్నారు అర్వింద్ గార్గ్​. ప్రతి జోన్​లో వివిధ అవసరాలకు వేర్వేరుగా మెడికల్​ కేంద్రాలు ఉండాని చెబుతున్నారు.

ప్రత్యేక క్యాడర్ ఉండాలి..

ఇండియన్​ అడ్మినిస్ట్రేటివ్​ సర్వీస్​ (ఐఏఎస్​), ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్​ఎస్​)ల తరహాలో.. హెల్త్​ కేర్ రంగాన్ని తీర్చిదిద్దగల నేషనల్ మెడికల్ సర్వీస్​ (ఎన్​ఎంఎస్​) క్యాడర్​ అవసరమంటున్నారు డాక్టర్ అర్వింద్.

కొన్ని విషయాల్లో కరోనా వైరస్​ మేలు చేసిందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

'మనకు ప్రత్యేక డేటా సేకరణ విభాగం అవసరం. భవిష్యత్​లో సంభవించే ఆరోగ్య అత్యవసర స్థితులను ఎదుర్కొనేందుకు ఎలా సిద్ధంగా ఉండాలనే విషయాన్ని కరోనా మహమ్మారి మనకు ముందే సూచించింది' అని వివరించారు

సంక్షోభం ఎదుర్కొనేందుకు ప్రత్యేక నిధి కావాలి..

"గత ఏడాది కరోనా నుంచి కాపాడుకునేందుకు మన దేశం భారీగా ఖర్చు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఈ సారి బడ్జెట్​లో కేటాయింపులు భారీగా పెంచొచ్చు. ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొనేందుకు పద్దులో ప్రొవిజన్​ కూడా అవసరం."

- డాక్టర్ సునీలా గార్గ్​, ప్రముఖ ఆరోగ్య రంగ విశ్లేషకురాలు, ఐసీఎంఆర్ సలహాదారు

ప్రైవేటు రంగానికి ప్రోత్సాహం అవసరం..

కరోనా మహమ్మారి ప్రాథమిక దశలో ఉన్నప్పుడు.. పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, మాస్క్​ల వంటివి దిగుమతి చేసుకునేందుకు భారత్ పెద్ద ఎత్తున ఖర్చు చేసిందనే విషయాన్ని సునీలా గార్గ్​ గుర్తు చేశారు. ఆ తర్వాతే భారతీయ కంపెనీలు పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, మాస్క్​ల వంటివి తయారు చేయడం ప్రారంభించినట్లు వివరించారు.

"ఆరోగ్య రంగంలో ప్రైవేటు రంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారివల్లే మనం ఇప్పుడు ఇతర దేశాలకు వైద్య పరికరాలు ఎగుమతి చేసే స్థాయికి చేరాం. కరోనా వ్యాక్సిన్​ను కూడా మనం ఇతర దేశాలకు ఎగుమతి చేయగలుగుతున్నాం."

-సునీలా గార్గ్​

ఆయుష్మాన్​ భారత్​, ఆత్మనిర్భర్​ భారత్ వంటివి ఆరోగ్య రంగానికి మరింత ప్రోత్సాహమందిస్తాయని ఆమె అభిప్రాయపడుతున్నారు.

39.7 శాతం వైద్య రంగానికే..

ఈ సారి బడ్జెట్​లో ఆరోగ్య రంగానికి అధిక కేటాయింపులు ఉండొచ్చని అసోచామ్​ సర్వే పేర్కొంది. కరోనా వల్ల ఎదురైన సంక్షోభం వందేళ్లకోసారి వస్తుందని అభిప్రాయపడింది.

ఈ సర్వేలో పాల్గొన్న 550 పరిశ్రమల్లో 39.7 శాతం.. వైద్యారోగ్య రంగానికి కేటాయింపులు అధికంగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశాయి.

ఆరోగ్య రంగం తర్వాత తయారీ రంగానికి బడ్జెట్​లో అధిక ప్రాధాన్యం ఉండొచ్చని 14.7 శాతం పరిశ్రమలు అభిప్రాయపడ్డట్లు సర్వే పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో ఎంఎస్​ఎంఈలు (11.4 శాతం), రియల్టీ (10.7 శాతం), మౌలిక సదుపాయాల రంగం (9.6 శాతం) ఉన్నట్లు సర్వే వివరించింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.