ETV Bharat / business

పరిశ్రమలను ఆదుకుంటాం.. త్వరలోనే భారీ ప్యాకేజీ! - కరోనా తాజా వార్తలు

కరోనా లాక్​డౌన్​తో దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్​ఎంఈ) భారీగా నష్టపోతున్నాయి. సంక్షోభంలోకి కూరుకుపోతున్న ఈ రంగానికి కేంద్రం త్వరలోనే... మంచి ఆర్థిక ప్యాకేజీ అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ.

Expecting financial package for MSMEs soon: Gadkari
ఎంఎస్​ఎంఈలకు త్వరలోనే భారీ ఆర్థిక ప్యాకేజీ!
author img

By

Published : May 5, 2020, 5:34 PM IST

దేశ ఆర్థిక వృద్ధిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్​ఎంఈ) రంగం వాటా దాదాపు 29 శాతం. 48 శాతం ఎగుమతులు దీని ద్వారానే జరుగుతుంటాయి. అతిపెద్ద ఉపాధి సృష్టికర్త కూడా ఇదే. ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఈ రంగంపై.. కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బ కొట్టింది. తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఉత్పత్తి నిలిచిపోయి, ఉద్యోగాలు పోతాయన్న అంచనాల నడుమ ఎంఎస్​ఎంఈలు మనుగడ కోసం కొట్టుమిట్టాడుతున్నాయి.

ఈ పరిస్థితుల్లోనే కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్​ఎంఈ రంగాన్ని ఆదుకుంటామని సంకేతాలిచ్చారు. మంచి ప్యాకేజీతో.. త్వరలోనే కేంద్రం నుంచి ప్రకటన వస్తుందని చూస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

''ప్రభుత్వం దీని గురించే తీవ్రంగా ఆలోచిస్తోంది. మేం కూడా సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తున్నాం. మేం ఎప్పటికప్పుడు అన్ని విభాగాలతోనూ చర్చలు జరుపుతున్నాం. పరస్పరం సమాలోచనలు చేయాలని సూచిస్తున్నాం. ఎంఎస్​ఎంఈ రంగం తిరిగి కోలుకునేలా మంచి ప్యాకేజీ వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం.''

- నితిన్​ గడ్కరీ, కేంద్ర మంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.