ETV Bharat / business

పన్ను రాయితీ కోసం ఇవి తప్పనిసరి..!

ఆదాయ పన్ను చెల్లింపునకు సమయం దగ్గర పడుతోంది. ఈ సమయంలో పన్ను చెల్లింపుదార్లు రాయితీలపై దృష్టిసారిస్తుంటారు. మరి అలా పన్ను మినహాయింపు పొందాలంటే ఏం చేయాలి? ఏఏ పత్రాలు సమర్పించాలి అనే అంశాలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం మీకోసం.

ఆదాయ పన్ను
author img

By

Published : Mar 28, 2019, 3:37 PM IST

ఆదాయ పన్ను చెల్లించేందుకు మార్చి 31తో గడువు ముగియనుంది. చెల్లింపుదార్లు పన్ను మినహాయింపును క్లెయిమ్​ చేసుకునేందుకు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులేంటో ఇప్పుడు చూద్దాం.

ఇంటి అద్దె వివరాలు

ఉద్యోగులు తమ వేతనాల్లో భాగంగా ఇంటి అద్దెనూ అలవెన్సుల కింద పొందుతారు. అయితే ఆదాయ పన్ను చెల్లింపులో మినహాయింపు పొందాలంటే పన్ను చెల్లింపుదారు తప్పని సరిగా ఇంటి అద్దె చెల్లిస్తున్నట్లు రసీదులు దగ్గరపెట్టుకోవాలి.

ఒకవేళ ఏడాదికి రూ. లక్షకు మించి ఇంటి అద్దె చెల్లిస్తున్నట్లయితే... ఆ ఇంటి యజమాని పాన్​కార్డు​ వివరాలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

ఎందుకంటే... స్థిరాస్తులను అద్దెకివ్వడం ద్వారా ఆర్జించే మొత్తం పన్ను సహిత ఆదాయ పరిధిలోకి వస్తుందని ఆదాయ పన్ను చట్టాలు చెబుతున్నాయి.

బీమా వివరాలు

ఆదాయ పన్ను చెల్లింపుల్లో మినహాయింపు పొందేందుకు మరో మార్గం బీమా పాలసీలు కొనుగోలు చేయడం. ఇందుకు జీవిత బీమా సహా ఆరోగ్య బీమాల డాక్యుమెంట్​లు సమర్పించాలి.

ఇందులో పన్ను చెల్లింపుదారు తల్లిదండ్రులు, భార్య, పిల్లలకు సంబంధించిన ప్రీమియం వివరాలు సమర్పించి పన్ను మినహాయింపునకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్యూషన్​ ఫీజులు

మీ పిల్లలకు చెల్లించే ట్యూషన్ ఫీజుల ద్వారా పన్ను రాయితీ పొందొచ్చు. ఇందుకు మీరు చెల్లించిన ఫీజు రసీదులను సమర్పించాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే వీటిపై దృష్టి సారించడం మంచిది. ఏడాది చివర్లో మీరు కావాలనుకున్నప్పుడు తీసుకుందాం అనుకోవడం పొరపాటు.

ఆ సమయంలో స్కూలు యాజమాన్యాలు స్పందించకపోవడమో లేదా మరే ఇతర కారణాలతోనైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.

ఆదాయపన్ను చట్టం 1961లోని సెక్షన్​ 80సీ ప్రకారం ఇద్దరు పిల్లలపై మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది.

ఫారం 26 ఏఎస్​

ఫారం 26 ఏఎస్​ అనేది పూర్తిగా మీ ఆదాయ పన్ను వివరాలకు సంబంధించినది.

ఇప్పటివరకు ఎంత మొత్తంలో పన్ను చెల్లించారనేది దీని ద్వారా తెలుసుకోవచ్చు. టీడీఎస్​ వివరాలూ పొందొచ్చు.దీని ఆధారంగా ప్రస్తుతం మీరు ఎంత పన్ను చెల్లించాలనేది లెక్కగట్టొచ్చు.

ఫారం 26 ఏఎస్ వివరాలు తెలుసుకునేందుకు https://incometaxindiaefiling.gov.in వెబ్​ సైట్​లోకి లాగ్​ఇన్ అవ్వాల్సి ఉంటుంది.

AP Video Delivery Log - 0900 GMT News
Thursday, 28 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0854: China MOFA Briefing AP Clients Only 4203173
DAILY MOFA BRIEFING
AP-APTN-0847: China Commerce AP Clients Only 4203172
China-US trade talks to resume with working dinner
AP-APTN-0837: Syria Israel Airstrikes AP Clients Only 4203171
Syria claims Israel struck targets in the country’s north
AP-APTN-0829: US WA Pushed Off Bridge Must Credit KATU, No Access Portland, Oregon Market, No Use US Broadcast Networks 4203168
Woman sentenced for pushing friend off bridge
AP-APTN-0803: Malta Hijack Tanker AP Clients Only 4203169
Ship taken back from migrants arrives in Malta
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.