పింఛను పథకం కింద ఏప్రిల్ నెలకుగానూ రూ.764 కోట్లు పంపిణీ చేసినట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తెలిపింది. 65 లక్షల మంది పింఛనుదారులకు ఈ మొత్తాన్ని చెల్లించినట్లు తెలిపింది.
దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో పింఛనుదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని కార్మికశాఖ ఆదేశాలానుసారం.. ఏప్రిల్లో ముందస్తుగానే చెల్లింపులు జరిపినట్లు ఈపీఎఫ్ఓ పేర్కొంది.
దేశవ్యాప్తంగా ఉన్న నోడల్ శాఖలకు ఈ మొత్తాన్ని (రూ.764 కోట్లను) పంపిణీ చేసేందుకు అధికారులు, ఇతర సిబ్బంది తీవ్రంగా కృషి చేసినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది.
ఇదీ చూడండి:ఎన్బీఎఫ్సీల రుణాలపైనా మారటోరియం పొడిగింపు!