అన్ని రకాల రుణాలపై ఒకేసారి సమీక్షకు 2021 మార్చి వరకు అవకాశమివ్వాలని రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ)ని కోరాయి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ). కరోనా మహమ్మారి, లాక్డౌన్తో తమ రుణగ్రహీతలు నగదుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఈ అవకాశమివ్వాలని విన్నవించాయి.
రీ ఫినాన్స్ విధానం ద్వారా భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్(ఎస్ఐడీబీఐ), వ్యవసాయ, గ్రామీణాభివృద్ది బ్యాంక్ (నాబార్డ్) నుంచి అదనపు రుణాలు ఇప్పించాలని..రుణాలపై మారటోరియం పొడిగించాలని ఆర్బీఐని కోరాయి ఎన్బీఎఫ్సీలు.
ఈ విషయాలన్నీ సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎన్బీఎఫ్సీల ప్రతినిధి సంస్థ ఫినాన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎఫ్ఐడీసీ) తెలిపింది. లాక్‌డౌన్ కారణంగా ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లు, గుత్తేదారులు, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు తీవ్రంగా ఒడుదొడుకులకు గురవుతున్న విషయాన్ని ఆర్‌బీఐకి గుర్తు చేసినట్లు పేర్కొంది.
ఇదీ చూడండి:భారత్లో 'విద్య' కోసం అమెరికా భారీ రుణసాయం