నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ఒక్క రోజు ముందు 2019- ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశ పెట్టారు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశం 7% వృద్ధి రేటు సాధిస్తుందని సర్వే అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.8 గా నమోదైంది. 2018-19లో ద్రవ్యలోటు 3.4 శాతమే ఉంటుందని అంచనా వేసింది.
2025 నాటికి 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపాంతరం చెందాలంటే 8% స్థిర వృద్ధిరేటు నమోదు చేయాల్సి ఉంటుందని ఆర్థిక సర్వే పేర్కొంది.
అంతర్జాతీయంగా పరిణామాలు మారుతున్న క్రమంలో 2019-20 కి గాను ముడి చమురు ధరలు తగ్గే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. ఫలితంగా దేశంలోనూ చమురు ధరలు తగ్గడానికి అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.
ప్రభుత్వ కఠిన నిర్ణయాల వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని అంచనావేసింది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వృద్ధి కొంతమేర మందగిస్తుందని ఆర్థిక సర్వే లెక్కగట్టింది.
- ఇదీ చూడండి: పద్దు 2019: నిర్మల సవాళ్ల సవారీ