ప్రపంచ ఆర్థిక వ్యవస్థ డిజిటలీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోందని అంతర్జాతీయ డేటా కార్పొరేషన్(ఐడీసీ) తెలిపింది. 2020 నుంచి 2023 నాటికి ఐటీ వ్యయాలు 6.8 ట్రిలియన్ డాలర్లుకు పెరగొచ్చని తాజా నివేదికలో పేర్కొంది.
ఈ ఏడాది కరోనా మహమ్మారి వల్ల అంతరాయలు ఏర్పడినప్పటికీ.. చాలా వస్తు, సేవలకు పోటీతత్వానికి డిజిటల్ డెలివరీ మోడల్ అవసరమైందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో 65 శాతం ప్రపంచార్థికం 2022 నాటికి డిజిటలైజ్ అవుతుందని పేర్కొంది నివేదిక. కరోనా నేపథ్యంలో నేర్చుకున్న పాఠాల ఆధారంగా.. 80 శాతం వరకు సంస్థలు క్లౌడ్ కేంద్రీకృత మౌలిక సదుపాయాలు, అప్లికేషన్లకు మారే ప్రక్రియ కరోనా ముందుతో పోలిస్తే రెట్టింపు అవుతుందని నివేదిక అభిప్రాయపడింది.
కరోనా కాలంలో మారిన శ్రామిక శక్తి పనితీరు, వ్యాపార కార్యకలాపాలు.. 2023 నాటికి 80 శాతం కంపెనీల పెట్టుబడులకు, బిజినెస్ మోడళ్లలో మార్పులకు కీలకంగా మారనున్నాయని ఐడీసీ పేర్కొంది.
ఇదీ చూడండి:ఈ కామర్స్ జోరు- పండుగ విక్రయాలు 55% వృద్ధి!