ETV Bharat / business

మీకు ఏ జీవిత బీమా సరిపోతుంది? - What is tern insurance

అనుకోకుండా వచ్చే కష్టాల నుంచి జీవిత బీమా పాలసీలు (Uses of Life Insurance) కుటుంబాన్ని ఆదుకుంటాయి. దీని ప్రాముఖ్యతను గుర్తించిన వారు పాలసీ తీసుకునేందుకు ముందుకు వస్తారు. కానీ, చాలా రకాల పాలసీలు ఉండడంతో కొంత గందరగోళానికి గురవుతారు. మరి మనకు ఏది అవసరం(Best insurance plan).. ఎలాంటి సందర్భంలోనైనా రక్షణ కల్పించేలా ఉండే వాటిని ఎలా ఎంచుకోవాలో చూద్దాం..!

What is Life Insurance
జీవిత బీమా అంటే ఏమిటి
author img

By

Published : Oct 3, 2021, 10:40 AM IST

జీవిత బీమా.. సులువుగా చెప్పాలంటే ఇది పాలసీదారుడు, బీమా సంస్థకు మధ్య కుదిరే ఒప్పందం. పాలసీదారుడు కొన్నేళ్ల పాటు లేదా కావాల్సినన్ని రోజులు సంస్థకు ప్రీమియం చెల్లిస్తారు. దీనికి ప్రతిఫలంగా.. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే సంస్థ నామినీకి ఒప్పందంలోని హామీ మొత్తాన్ని చెల్లిస్తుంది. కొన్ని పాలసీల్లో అయితే, పాలసీ కాలపరిమితి ముగియగానే.. పాలసీదారుడికి కొంత మొత్తం చెల్లిస్తారు. ఇది పాలసీని బట్టి మారుతూ ఉంటుంది.

మొత్తం ఐదు రకాల జీవిత బీమా పాలసీలు ఉన్నాయి. వాటి వివరాలు, ప్రయోజనాలు చూద్దాం..

టర్మ్‌ ప్లాన్‌..

టర్మ్​ పాలసీ ఒక స్వచ్ఛమైన జీవిత బీమా పాలసీగా పేర్కొంటుంటారు. ఇందులో మీరు ఒక నిర్దేశిత కాలం పాటు కొంత సొమ్మును వివిధ వాయిదాల్లో బీమా సంస్థకు చెల్లిస్తారు. మనం ఎంచుకున్న దాన్ని బట్టి ఇది కొన్నేళ్ల పాటు కొనసాగుతుంది. ఈ మధ్య సమయంలో పాలసీదారుడు మరణిస్తే.. హామీ మొత్తం నామినీకి అందజేస్తారు. ఒకవేళ పాలసీదారుడు సురక్షితంగా ఉంటే పాలసీ కాలపరిమితి ముగిసిన తర్వాత ఎలాంటి ప్రతిఫలం అందదు.(ఒక్క రిటర్న్‌ ఆఫ్‌ ప్రీమియం టర్మ్‌ ప్లాన్‌(టీఆర్‌ఓపీ)లో మాత్రం కాలపరిమితి తర్వాత పరిహారం అందజేస్తారు)

ప్రయోజనాలు..

ఇతర జీవిత బీమా పాలసీలతో పోలిస్తే.. తక్కువ ప్రీమియానికే ఎక్కువ హామీ మొత్తాన్ని పొందవచ్చు.

టీర్‌ఓపీ ఎంచుకుంటే మీరు కట్టిన ప్రీమియం మొత్తం తిరిగొస్తుంది. కానీ, అదనంగా వడ్డీ చెల్లించరు.

పూర్తిస్థాయి జీవిత బీమా పాలసీ..

పేరులో ఉన్నట్లుగానే.. ఈ పాలసీ పూర్తి జీవితానికి వర్తిస్తుంది. అయితే, క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించాలి. పాలసీదారుడు మధ్యలో మరణిస్తే వారిపై ఆధారపడిన వారికి హామీ మొత్తాన్ని అందజేస్తారు. కొన్ని సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లిస్తే.. జీవితాంతం బీమా వర్తిస్తుంది. పాలసీ బట్టి 10-15 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాలి.

ప్రయోజనాలు..

దీంట్లో ఒక నిర్దేశిత కాలపరమితి ఉండదు.

హామీ మొత్తంతో పాటు దీంట్లో పొదుపు కూడా ఉంటుంది. మీరు చెల్లించిన మొత్తంలో కొంత మొత్తాన్ని మదుపు చేసి వచ్చిన లాభాల్ని బోనస్‌ రూపంలో చెల్లిస్తారు. లేదా నామినీకి హామీ మొత్తంతో పాటు పొదుపు చేసిన మొత్తాన్ని అందజేస్తారు.

దీనిపై లోన్ కూడా తీసుకోవచ్చు.

ఎండోమెంట్‌ బీమా పాలసీ..

ఎండో పాలసీలో కూడా పూర్తిస్థాయి జీవిత బీమా పాలసీ వలే బీమా రక్షణతో పాటు పొదుపు ఉంటుంది. అయితే, దీనికి నిర్దేశిత కాలపరిమితి ఉంటుంది. క్రమం తప్పకుడా ప్రీమియం చెల్లిస్తే పాలసీదారుడి అకాల మరణం సమయంలో నామినీకి హామీ మొత్తం చెల్లిస్తారు. ఒకవేళ కాలపరిమితి ముగిసేవ వరకు పాలసీదారుడు ఉన్నట్లైతే.. ఒకేసారి మెచ్యూరిటీ బెనిఫిట్‌ కింద పెద్ద మొత్తంలో చెల్లిస్తారు.

ప్రయోజనాలు..

హామీ మొత్తంతో పాటు పాలసీదారుడికి పొదుపు కూడా అందుతుంది. కేవలం బీమా రక్షణకే కాకుండా నిర్దేశిత ఆర్థిక లక్ష్యాల కోసం దీన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఆర్థిక అత్యవసర సమయంలో లోన్‌ కూడా తీసుకోవచ్చు.

మనీబ్యాక్‌ పాలసీ..

పేరు సూచిస్తున్నట్లుగా కాలపరిమితి ముగియక ముందే.. పాలసీదారుడు ప్రతినెలా కొంత మొత్తం పరిహారంగా అందుకుంటారు. హామీ మొత్తంలో కొంత భాగాన్ని ఇలా అందిస్తారు. పాలసీ గడువు ముగిసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని బోనస్‌తో కలిపి చెల్లిస్తారు. ఒకవేళ పాలసీదారుడి అకాల మరణం సంభవిస్తే.. నామినీకి హామీ మొత్తం అందజేస్తారు. అయితే, పాలసీదారుడు బతికున్నప్పుడు చెల్లించిన పరిహారాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోరు.

ప్రయోజనాలు..

సాధారణంగా అన్ని పాలసీల్లో ప్రతిఫలం పొందాలంటే పాలసీ గడువు ముగిసే వరకు వేచి చూడాలి. కానీ, ఇక్కడ అలా కాదు. ప్రతి నెలా కొంత మొత్తం అందుతుంది. రిటైర్‌మెంట్‌ తర్వాత లేదా నెలవారీ ఆర్జనలో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ (యులిప్‌)..

బీమా రక్షణ, పెట్టుబడితో కూడిన బీమా పాలసీయే యులిప్‌. దీన్ని ఒకరకంగా టర్మ్‌ ప్లాన్‌, మ్యూచువల్‌ ఫండ్లతో కూడిన పథకంగా పేర్కొంటుంటారు. మనం చెల్లించే ప్రీమియాన్ని డెట్‌, ఈక్విటీల్లో మదుపు చేస్తారు. దీనికి బీమా సంస్థల వద్ద అనుభవం గల ఫండ్‌ మేనేజర్లు ఉంటారు. అయితే, మన సొమ్ములో ఎంత మొత్తాన్ని ఎక్కడ మదుపు చేయాలో మనమే నిర్ణయించుకోవచ్చు. దీన్ని బట్టే కాలపరిమితి తర్వాత అందే ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాలసీదారుడు మధ్యలోనే మరణిస్తే.. హామీ మొత్తాన్ని నామినీకి అందజేస్తారు.

ప్రయోజనాలు..

ఇతర బీమా పాలసీలతో పోలిస్తే.. దీంట్లో ఎక్కవ ప్రతిఫలం అందే అవకాశం ఉంది. ఈక్విటీల్లో జాగ్రత్తగా ఇన్వెస్ట్‌ చేస్తే పెద్ద ఎత్తున రిటర్న్స్‌ పొందే అవకాశం ఉంది. ఒకవేళ పెట్టిన పెట్టుబడి వల్ల నష్టాలొచ్చినా.. పాలసీదారుడు మరణిస్తే నామినీకి పూర్తిస్థాయి హామీ మొత్తం చెల్లిస్తారు.

పాలసీదారుడు మరణిస్తే వారి కుటుంబానికి అవధి బీమా అండగా నిలుస్తుంది. ఇది ప్రతిఒక్కరికీ తప్పనిసరని నిపుణులు సూచిస్తుంటారు. ఇక దీంతోపాటు మరో పాలసీ తీసుకుంటే.. మన అవసరాన్ని బట్టి మనకు ఏది నప్పితే దాన్ని ఎంచుకోవాలి. అవసరం, ప్రయోజనాలు, ప్రీమియం చెల్లించే స్తోమతను బట్టి పాలసీని తీసుకోవాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.