కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు సరికొత్త ఆఫర్ను ప్రకటించాయి. వాక్సిన్ తీసుకున్న వారికి ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణం కన్నా అధిక వడ్డీ రేటు చెల్లించనున్నట్లు వెల్లడించాయి. అయితే ఇది పరిమిత కాల ఆఫర్ అని స్పష్టం చేశాయి.
ఆఫర్లు ఇలా..
కనీసం ఒక డోస్ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి 999 రోజుల పరిమితి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్(ఎఫ్డీ)పై 0.30 శాతం వడ్డీ అధికంగా చెల్లించనున్నట్లు యూకో బ్యాంక్ ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 'ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీమ్'ను ప్రారంభించింది. దీని ద్వారా కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వినియోగదారులకు ఎఫ్డీపై 25 బేసిస్ పాయింట్ల (0.25 శాతం) వడ్డీ రేటు అధికంగా చెల్లించనున్నట్లు తెలిపింది. ఈ కొత్త పథకం ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీని 1,111 రోజులుగా నిర్ణయించింది.
ఇదీ చదవండి:టాప్-'అప్పు' కోసం రుణ బదిలీ మంచిదేనా?