ETV Bharat / business

'6 నెలల్లో రూ.864 కోట్ల కరోనా పాలసీల కొనుగోలు' - కరోనా కవచ్​ పాలసీలు తీసుకున్న వారి సంఖ్య

ప్రపంచాన్ని కరోనా వైరస్​ మహమ్మారి భయాలు వెంటాడుతున్న తరుణంలో ప్రజల్లో ఆరోగ్య బీమాపై అవగాహన పెరిగింది. గత ఏడాది ఏప్రిల్​-సెప్టెంబర్ మధ్య 23.75 లక్షల కొవిడ్ పాలసీలను ప్రజలు కొనుగోలు చేసినట్లు ఆర్​బీఐ నివేదిక ద్వారా తెలిసింది. వీటితో మొత్తం 1.1 కోట్ల మంది కరోనా బీమా పరిధిలోకి వచ్చినట్లు నివేదిక పేర్కొంది.

Covid fears rise health insurance sales
దేశంలో కరోనా పాలసీలు తీసుకున్న వారి సంఖ్య
author img

By

Published : Jan 17, 2021, 12:24 PM IST

కరోనా భయాలతో ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది. దేశవ్యాప్తంగా 2020 ఏప్రిల్-సెప్టెంబర్​ మధ్య రూ.864 కోట్ల విలువైన కరోనా పాలసీలను ప్రజలు కొనుగోలు చేసినట్లు ఆర్​బీఐ తెలిపింది.

సగటున ఒక్కో పాలసీని రూ.3,600తో మొత్తం 23.75లక్షల కొవిడ్​ పాలసీలు తీసుకున్నట్లు వెల్లడించింది ఆర్​బీఐ.

బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్​డీఏఐ) ఆదేశాల మేరకు గత ఏడాది అన్ని జీవిత, ఆరోగ్య బీమా సంస్థలు కరోనా వ్యాధికి బీమానిచ్చే నిర్దిష్ట పాలసీలను తీసుకొచ్చాయి.

'కరోనా కవచ్​'దే సింహ భాగం..

గత ఏడాది ఏప్రిల్​-సెప్టెంబర్ మధ్య విక్రయమైన కొవిడ్​ పాలసీల్లో.. 'కరోనా కవచ్' 82.43 శాతం (19.58 లక్షలు) వాటాతో సింహ భాగాన్ని దక్కించుకుంది. 'కరోనా రక్షక్' పాలసీల వాటా 16 శాతం (3.8 లక్షలు)గా ఉంది. ఇతర పాలసీలు (కొవిడ్​ సంబంధించినవి) 37 వేలుగా ఉన్నట్లు ఆర్​బీఐ గణాకాల్లో తేలింది.

ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకున్నప్పుడు.. ఎలాంటి మినహాయింపులు లేకుండా అన్ని రకాల ఫీజులు, ఖర్చులకూ పరిహారం లభించడం సహా అనేక ఇతర సదుపాయాలున్నందున 'కరోనా కవచ్​' పాలసీలను ఎక్కువ మంది కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

కరోనా పాలసీల పరిధిలోకి 1.1 కోట్ల మంది..

గతేడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య తీసుకున్న బీమాలతో.. దేశవ్యాప్తంగా మొత్తం 1.1 కోట్ల మంది కరోనా పాలసీల పరిధిలోకి వచ్చారు. వారికి బీమా మొత్తం రూ.12.9లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్​బీఐ వెల్లడించింది. అయితే ఇందులో సీనియర్ సిటిజన్ల సంఖ్య అత్యల్పంగా ఉన్నట్లు పేర్కొంది.

2019 గణాంకాల ప్రకారం దేశంలో 136 కోట్ల మంది జనాభా ఉంది. అందులో 8 శాతం సీనియర్ సిటిజన్లు. అయితే కరోనా కవచ్​ పాలసీ పరిధిలో సీనియర్ సిటిజన్లు 7 శాతంగా ఉన్నట్లు ఆర్​బీఐ వివరించింది. కరోనా రక్షక్​ పరిధిలో 4 శాతం మాత్రమే సీనియర్ సిటిజన్లు ఉన్నారని తెలిపింది.

ఇదీ చూడండి:పద్దులో వైద్య రంగానికి ప్రత్యేక నిధి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.