ETV Bharat / business

దేశార్థికంపై కరోనా 2.0 ప్రభావం తక్కువే.. కానీ.. - దేశార్థికంపై ఫిచ్​ ఆందోళన

కరోనా రెండో దశ ప్రభావం దేశార్థికంపై తక్కువగానే ఉండొచ్చని ఆర్థిక శాఖ అంచనా వేసింది. గత అనుభవాలను ఉపయోగించుకుని కొవిడ్​తో సహజీవనం చేస్తూనే.. వృద్ధి దిశగా ముందుకు సాగొచ్చని పేర్కొంది. అయితే రెండో దశ వల్ల ఇప్పటికే కొంత ప్రతీకూలత ప్రభావం పడినట్లు స్పష్టం చేసింది.

Finmin on Corona Second wave
నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి
author img

By

Published : May 7, 2021, 5:42 PM IST

దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్​ సెకండ్ వేవ్​ ప్రభావం.. మొదటి దశతో పోలిస్తే తక్కువగానే ఉండొచ్చని ఆర్థిక శాఖ నెలవారీ నివేదిక పేర్కొంది. అయితే 2021-22 మొదటి త్రైమాసికంలో మాత్రం కొవిడ్ రెండో దశ వల్ల ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడినట్లు స్పష్టం చేసింది. గత అనుభవాలతో మహమ్మారితో కలిసి జీవిస్తూనే.. రెండో దశలో ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని నివేదిక వివరించింది.

ఇందుకు ఇటీవలి కాలంలో ఆర్థిక వ్యవస్థ రికవరీని ఉదాహరణగా పేర్కొంది ఆర్థిక శాఖ. కరోనా ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం నుంచి ఆర్థిక వ్యవస్థ రికవరీ దిశగా వేగంగా అడుగులు వేసిందని గుర్తుచేసింది.

జీఎస్​టీ రికార్డులు..

ఇప్పటి వరకు ఉన్న గణాంకాలు చూస్తే.. 2020-21కి గానూ నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు సవరించిన అంచనాలకన్నా 5 శాతం, 2019-20 కన్నా 4.5 శాతం ఎక్కువగా నమోదయ్యాయి.

జీఎస్​టీ వసూళ్ల విషయానికొస్తే.. గడిచిన ఆరు నెలల నుంచి రూ.లక్ష కోట్లకుపైనే ఉంటున్నాయి. ఏప్రిల్​లో అత్యధికంగా రూ.1.41 లక్షల కోట్లు వసూలయ్యాయి.

స్టాక్ మార్కెట్లను పరిశీలిస్తే..

కరోనా రెండో దశ స్టాక్ మార్కెట్ల సెంటిమెంట్​ను దెబ్బతీసినట్లు తెలిపింది నివేదిక. ఈ కారణంగా ఏప్రిల్​లో బీఎస్​ఈ-సెన్సెక్స్​ 1.5 శాతం, నిఫ్టీ 50.. 0.4 శాతం నష్టపోయినట్లు వివరించింది. ఇదే సమయంలో రూపాయి కూడా 2.3 శాతం తగ్గినట్లు తెలిపింది. ఫలితంగా డాలర్​తో పోలిస్తే మారకం విలువ 74.51 వద్దకు చేరినట్లు పేర్కొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.