ETV Bharat / business

'2021-22లో దేశ వృద్ధి రేటు 9.5 శాతమే!' - 2021-22లో భారత వృద్ధి రేటు

కరోనా రెండో దశ భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. కొవిడ్​ ఆంక్షల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు 9.5 శాతానికి పరిమితమవ్వచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది.

Covid dragging India Economy
కరోనాతో వృద్ధి రేటుపై నీలి మేఘాలు
author img

By

Published : May 6, 2021, 5:42 PM IST

దేశ వృద్ధి రేటుపై ఈ ఏడాది ఆరంభంలో భారీ అంచనాలు విడుదల చేసిన రేటింగ్ ఏజెన్సీలు ఇప్పుడు వాటికి కోతలు విధిస్తున్నాయి. 2021-22లో భారత వృద్ధి రేటు 9.5 శాతానికి పరిమితం అవ్వచ్చని ఫిచ్​ రేటింగ్స్ తాజాగా లెక్కగట్టింది. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత రోజు రోజుకు తీవ్రమవుతుండటం ఇందుకు కారణంగా పేర్కొంది ఫిచ్.

మార్చిలో ఫిచ్​ అంచనా 12.8 శాతంగా ఉండటం గమనార్హం.

ఇదే కారణంతో ఎస్​&పీ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు అంచనాను 9.8 శాతానికి సవరిస్తూ బుధవారం నివేదిక విడుదల చేసింది. ఏప్రిల్​ ఆరంభంలో ఈ అంచనా 11 శాతంగా ఉండటం గమనార్హం.

ఇదీ చదవండి:కొత్త పేరుతో భారత యూజర్లకు 'పబ్​జీ'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.