ETV Bharat / business

పద్దు 2021-22: 'ఆరోగ్య' భారతానికి ఊతమిస్తారా? - బడ్జెట్ 2021-22కు వైద్య రంగం సూచనలు

కేంద్రం త్వరలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి పద్దు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అన్ని రంగాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. అయితే అన్నింటికన్నా ఆరోగ్య రంగానికి భారీగా కేటాయింపులు ఉండొచ్చని హెల్త్​కేర్ విభాగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిచ్చే విధంగా కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు.

health care demands to Budget
బడ్జెట్​కు ఆరోగ్య రంగం సూచనలు
author img

By

Published : Jan 24, 2021, 3:01 PM IST

ప్రజల జీవితాలకు ఆరోగ్య రంగం ఎంత కీలకమైందో, అందులో లోటుపాట్లు ఏమిటో కరోనా సంక్షోభం ఎత్తిచూపిందని నిపుణులు అంటున్నారు. ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కూడా ఎంత అవసరమో మహమ్మారి ప్రపంచానికి గుర్తు చేసిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్​లో ఆ దిశగా కీలక నిర్ణయాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ఏ రంగాలకు లేని విధంగా ఈసారి ఆరోగ్య రంగానికి బడ్జెట్లో కేటాయింపులు అవసరమని సూచిస్తున్నారు.

ఫార్మాకు పోత్సహకాలు కావాలి..

ప్రపంచంలోనే మన ఫార్మా రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రంగానికి.. ముఖ్యంగా పరిశోధన, అభివృద్ధి, నవకల్పన విభాగాలకు రానున్న బడ్జెట్​లో భారీ ప్రోత్సహకాలు అత్యంత అవసరమని ఆరోగ్య రంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ అంశాలకు అధిక ప్రాధాన్యం..

'ప్రజారోగ్యం కన్నా ముఖ్యమైంది ఏదీ లేదనే విషయాన్ని కరోనాతో రుజువైంది. ఇది హెల్త్​కేర్​పై పెట్టుబడులు పెరగాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. పెరిగిన అవసరాలకు తగ్గట్లు జాతీయ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలతో వైద్య రంగంలో సిబ్బందిని పెంచుకోవాలి. మెడికల్ కాలేజీల సంఖ్య పెరగాలి. పబ్లిక్​ ప్రైవేటు భాగస్వామ్యంతో.. స్థానికంగా వైద్య పరికరాల తయారీని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.' అని జాతీయ హెల్త్​కేర్​ సమాఖ్య అధ్యక్షురాలు, అపోలో ఆస్పత్రులు ఎగ్జిక్యుటివ్ వైస్​ ఛైర్​పర్సన్​ ప్రీతా రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్​లో ఈ అంశాన్నింటికీ అధిక ప్రాధాన్యం ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

'కరోనాతో దెబ్బతిన్న తమ వ్యాపారాల రికవరీకి ప్రభుత్వం నుంచి అదనపు పోత్సాహకాలు అందుతాయని ప్రైవేటు హెల్త్​కేర్ విభాగం భారీ అశలు పెట్టుకుంది. టైర్​ 2-3 పట్టణాలకు విస్తరించేందుకు సబ్సిడీతో స్థలాల కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనకు పన్ను మినహాయింపు, హెల్త్​కేర్ విభాగానికి జీఎస్​టీ నిబంధనల్లో సడలింపులు ఉండాలని ఆశిస్తోంది' అని తెలిపారు ప్రీతా రెడ్డి.

ఉద్యోగాలూ పెరుగుతాయ్..

బడ్జెట్​లో ఆరోగ్య రంగానికి అత్యధిక కేటాయింపుల అవసరాన్ని కొవిడ్ మహమ్మారి నొక్కి చెప్పిందని ఫోర్టీస్​ హెల్త్​కేర్​ ఎండీ, సీఈఓ అశుతోశ్​ రఘువన్షి అన్నారు.

ప్రస్తుత పరిస్థితులు ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయిల్లో ఆరోగ్య రంగం తేరుకునేలా, మౌలిక వసతుల కల్పన వేగం పెంచాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయన్నారు అశుతోశ్​. దీనితో ఉద్యోగ కల్పన కూడా భారీగా పెరుగుతుందనే విషయాన్ని ఆయన వివరించారు.

సెస్ రద్దు చేయాలి..

కరోనా వల్ల ఏర్పడిన కష్టాల నుంచి గట్టెక్కేందుకు 2021-22 బడ్జెట్​లో కస్టమ్​ డ్యూటీల తగ్గింపు, హెల్త్​ సెస్ రద్దు వంటి నిర్ణయాలు ఉండాలని మెడికల్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.

ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి మేరకు ప్రతికూల పరిస్థితుల్లోనూ మెడికల్ టెక్నాలజీ విభాగంలో ఉద్యోగాలు తొలగించలేదు. దాని వల్ల ఏర్పడిన ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు బడ్జెట్​లో తక్షణ ఊరట లభిస్తుందని ఆశిస్తున్నట్లు మెడికల్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ పవన్​ చౌదరి పేర్కొన్నారు.

జీడీపీలో 2 శాతానికి కేటాయింపులు పెరగాలి..

గత బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేంద్రం రూ.69 వేల కోట్లు కేటాయించింది. 2015 ఆర్థిక సంవత్సరం నుంచి 2020 వరకు బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరిగినా.. ప్రజారోగ్యంపై బ్రిక్స్‌ దేశాల్లో కెల్లా అతి తక్కువగా ఖర్చుపెట్టేది మన దేశమేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలను చేపట్టినప్పటికీ దేశ జనాభాలో ఎక్కువ భాగానికి ఆరోగ్య సంరక్షణ ఖర్చు.. అధికంగానే ఉన్నట్లు చెబుతున్నారు. దీన్ని తగ్గించేలా.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ సారి బడ్జెట్‌లో ప్రజారోగ్యంపై కేటాయింపులను జీడీపీలో కనీసం 2 శాతానికి పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చూడండి:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.