ETV Bharat / business

కరోనా ఎఫెక్ట్​: ప్రతులు లేకుండానే బడ్జెట్ ప్రసంగం?

పార్లమెంట్​లో బడ్జెట్ ప్రతులను పట్టుకుని కేంద్ర ఆర్థిక మంత్రి చేసే ప్రసంగాన్ని దేశం యావత్తూ వీక్షిస్తుంటుంది. సభ్యులందరూ ఆ ప్రతులను పరిశీలిస్తూ తమ అభ్యంతరాలను లేవనెత్తడం మనం చూస్తూనే ఉంటాం. అయితే కరోనా కారణంగా ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్​లో ప్రతులు ఉండవు అంటున్నాయి కేంద్ర ఆర్థిక వర్గాలు. ప్రతులు బదులు సభ్యులందరికీ బడ్జెట్‌ సాఫ్ట్‌ కాపీలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

budget speech without budget documents
ప్రతులు లేకుండానే బడ్జెట్ ప్రసంగం..?
author img

By

Published : Jan 11, 2021, 9:10 PM IST

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు.. పార్లమెంట్‌ ప్రాంగణంలో సందడి అంతా ఇంతా కాదు. ఆర్థికశాఖ కార్యాలయం నుంచి అత్యంత భద్రత నడుమ బడ్జెట్‌ ప్రతుల ట్రక్కు పార్లమెంట్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత జాగిలాల తనిఖీల అనంతరం పత్రాలను సభ్యులకు అందిస్తారు. అయితే ఈసారి ఆ కోలాహాలం ఏదీ కనిపించకపోవచ్చు. కరోనా మహమ్మారి దృష్ట్యా ఈ ఏడాది బడ్జెట్‌ పత్రాలను ప్రింట్‌ చేయట్లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే జరిగితే స్వతంత్ర్య భారతంలో తొలిసారిగా బడ్జెట్‌ ప్రతులు లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు జరగడం ఇదే తొలిసారి కానుంది.

బడ్జెట్‌ ప్రతులు..

సాధారణంగా బడ్జెట్‌ సమావేశాలకు రెండు వారాల ముందు నుంచే బడ్జెట్‌ పత్రాల ప్రింటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆర్థికశాఖ కార్యాలయంలో ఉన్న ప్రింటింగ్‌ ప్రెస్‌లో ప్రతుల ముద్రణ చేపడతారు. 100 మందికి పైనే ఇందులో పనిచేస్తారు. అయితే కరోనా వ్యాప్తి ముప్పు దృష్ట్యా అంతమందిని రెండువారాల పాటు ఒకే చోట ఉంచడం ప్రమాదమని భావించిన కేంద్రం.. ఈ విషయాన్ని పార్లమెంట్‌ దృష్టికి తీసుకెళ్లింది. బడ్జెట్‌ పత్రాల ప్రింటింగ్‌ చేయకూడదనుకుంటున్నట్లు తెలిపింది. ఇందుకు సభ్యులు కూడా సమ్మతించడంతో ఈ ఏడాది బడ్జెట్‌ ప్రతుల ముద్రణ చేపట్టట్లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనికి బదులు సభ్యులందరికీ బడ్జెట్‌ సాఫ్ట్‌ కాపీలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

వేడుక ప్రత్యేకం..

1947 నవంబరు 26న తొలిసారి కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏటా బడ్జెట్‌ పత్రాల ముద్రణ చేపడుతున్నారు. బడ్జెట్‌ సమావేశానికి రెండు వారాల ముందు ఈ ప్రింటింగ్‌ మొదలుపెడతారు. ఈ ప్రక్రియ ప్రారంభాన్ని పురస్కరించుకుని ఆర్థికశాఖ హల్వా వేడుక కూడా నిర్వహిస్తుంది. సిబ్బందికి హల్వా పంచిన తర్వాత ప్రింటింగ్‌ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత బడ్జెట్‌ రోజున ఈ ప్రతులను ఓ ట్రక్కులో పార్లమెంట్‌కు చేరుస్తారు. కరోనా కారణంగా ఈసారి ఇవన్నీ రద్దయ్యాయి. ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాలు జనవరి 29 నుంచి ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. 2021-22 కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు.

ఇదీ చదవండి: పద్దు ​2021-22: అంద‌రి క‌ళ్లు ఫిబ్ర‌వ‌రి 1 పైనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.