ETV Bharat / business

కాంట్రాక్టులపై కరోనా మహమ్మారి కాటు! - corona virus latest

ప్రజల కదలికలపై పరిమితులు విధిస్తే ఆ ప్రభావం మానవ మనుగడపై పడింది. ఇంజినీరింగ్‌ కాంట్రాక్టర్లు, సరఫరాదారులు, ఫైనాన్షియర్ల పనులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. మరి వారి దుర్భర పరిస్థితి తిరిగి సాధారణ స్థితికి ఎప్పటికి వస్తుంది..? దేశ ఆర్ధిక ప్రగతిలో కాంట్రక్టుల పాత్ర ఏమిటి?

Breaking News
author img

By

Published : Apr 14, 2020, 9:12 AM IST

లాక్‌డౌన్‌ కారణంగా కార్పొరేట్‌, వ్యాపార, పరిశ్రమ, ప్రభుత్వరంగ సంస్థల మూసివేతతో ఆర్థిక ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అన్ని రంగాల్లోని సంస్థలు ముందుగానే కుదుర్చుకున్న కట్టుబాట్ల నుంచి బయటపడే దిశగా సమాలోచనలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రజల కదలికలపై పరిమితులు విధించడంతో ఆ ప్రభావం మానవ జీవితంలోని ప్రతి అంశంపైనా పడింది. అది వ్యాపారం, ఉత్పత్తి, వాణిజ్యం, నిర్మాణం, రవాణా వంటి అన్ని రంగాలపైనా ప్రభావం చూపింది. వైరస్‌ను నియంత్రించే కార్యక్రమం పక్కకు జరిగితే, దృష్టి పెట్టాల్సిన అంశాల జాబితా భారీగానే ఉంది. ఇప్పటికే కుదిరిన ఒప్పందాల మేరకు పూర్తి చేయాల్సిన పనుల్లో జరిగిన జాప్యాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. నిర్మాణ ఒప్పందాల నుంచి తయారీ, సరఫరా ఒప్పందాల వరకు, ప్రొఫెషనల్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి ఇంజినీరింగ్‌ కాంట్రాక్టర్లు, సరఫరాదారులు, ఫైనాన్షియర్ల వరకు ఈ జాబితాలో ఉన్నవారే. ఇప్పటికే కుదిరిన ఒప్పందాలకు సంబంధించి ధరలు, నియమ నిబంధనలపై మళ్లీ సంప్రదింపులు జరుపుదామనే డిమాండ్లూ తలెత్తే అవకాశం లేకపోలేదు. ఇదంతా చివరికి ‘ఫోర్స్‌ మెజూర్‌’ అనే అంశం అమలుకు దారితీస్తుంది. ఫ్రెంఛ్‌ భాషలో ‘ఫోర్స్‌ మెజూర్‌’ అంటే సమున్నత శక్తి అని అర్థంగా చెప్పుకోవచ్చు. మన చేతుల్లో లేని, నియంత్రించలేని ఘటనల్ని వాణిజ్య రంగంలో ఫోర్స్‌ మెజూర్‌గా పరిగణిస్తారు. యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, మహమ్మారి వ్యాప్తి వంటి ఉదంతాలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో తప్పు ఏ ఒక్క పక్షానిదీ కాదు. సదరు విపత్కర పరిస్థితుల్లో వాణిజ్య కార్యకలాపాల్ని సాధారణ స్థితిలో నిర్వహించడం కూడా కష్టమే. ఒక కంపెనీ ఏదైనా ఒప్పందాన్ని కుదుర్చుకునేటప్పుడు ఇలాంటి ఫోర్స్‌ మెజూర్‌ నిబంధనను ఒప్పందంలో చేర్చవచ్చు. ఒక సంస్థ తన నియంత్రణలో లేని కారణాలతో ఒప్పందంలోని నియమ నిబంధనల్ని నెరవేర్చలేని పరిస్థితులు నెలకొంటే ఈ నిబంధన ఉపయోగపడుతుంది.

భారత్‌లో ప్రస్తుత లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ఉత్పాదక రంగం దెబ్బతిన్నందున పాత ఒప్పందాల నుంచి బయటపడటానికి ఫోర్స్‌మెజూర్‌ నిబంధనను వాడుకోవచ్చా అనే కోణాన్ని పరిశీలించేందుకు అనేక భారత వాణిజ్య సంస్థలు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. భారత లిక్విఫైడ్‌ న్యాచురల్‌ గ్యాస్‌(ఎల్‌ఎన్‌జీ) దిగుమతిదారులు సైతం సరఫరాదారులకు ఫోర్స్‌ మెజూర్‌ నోటీసుల్ని జారీ చేశారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ దేశీయ గ్యాస్‌ డిమాండ్‌ను, ఓడరేవు కార్యకలాపాలను దెబ్బ తీయడంతో పరిస్థితి ఇలాంటి నోటీసుకు దారి తీసినట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. భారతీయ కంపెనీల్లో తీవ్రస్థాయి కార్పొరేట్‌ ఒత్తిడి కనిపిస్తోందని, సరఫరాదారులకు చెల్లింపుల్ని నిలిపి వేసేందుకు ఫోర్స్‌ మెజూర్‌ నిబంధనను లేవనెత్తే అవకాశం ఉందని ఒక అంతర్జాతీయ ఆర్థిక వార్తాపత్రిక పేర్కొంది. ఇందులో భారత చమురు సంస్థ, అదాని పోర్ట్స్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తదితర కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. పునరుత్పాదక ఇంధన సంస్థలు సరఫరా గొలుసులో అంతరాయాల సమస్యను ఎదుర్కొంటున్నాయి. ప్రాజెక్టుల కాలపరిమితిని పొడిగించేందుకు ఆ నిబంధనను ఉపయోగించాలని ఆయా సంస్థలు కేంద్రాన్ని కోరుతున్నాయి. కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కాలపరిమితిని పొడిగించేందుకు అంగీకారం తెలిపింది.

టోల్‌ వసూళ్లలో తిరోగమనం వల్ల భారత్‌లోని రహదారి ప్రాజెక్టుల్లో పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టిన ప్రపంచస్థాయి మౌలికరంగ ఫండ్లు భారీ నష్టాల్ని చవిచూసే అవకాశం ఉన్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. భారత్‌లోని ప్రధాన రహదారుల్లో చాలావరకు ప్రైవేటు విదేశీ పెట్టుబడిదారుల యాజమాన్యంలోనే ఉన్నాయి. ఎన్‌హెచ్‌ఏఐ గణాంకాల ప్రకారం జాతీయ రహదారులకు సంబంధించి... మార్చి 15 మార్చి 22 మధ్య 50 శాతం వరకూ క్షీణత నమోదైంది. మాక్వరీ, జీఐసీ, క్యూబ్‌హైవేస్‌ వంటి ప్రపంచస్థాయి ఆర్థిక సంస్థలతోపాటు, అగ్రశ్రేణి కెనడా ఫండ్లు, బ్రూక్‌ఫీల్డ్‌, సీపీపీఐబీ, సీడీపీక్యూ, ఓఎంఈఆర్‌ఎస్‌ వంటి గ్రూపులు గత కొన్నేళ్లలో భారత రహదారి ప్రాజెక్టుల్లో 5 లక్షల కోట్ల డాలర్లకుపైగా పెట్టుబడి పెట్టినట్లు వాణిజ్య వర్గాల సమాచారం. తీవ్రమైన కార్మికుల కొరత ఎదుర్కొంటున్న సింగపూర్‌ నిర్మాణ సంస్థలు కూడా భవన నిర్మాణ ఒప్పందాల్లో ఫోర్స్‌మెజూర్‌ నిబంధనను వర్తింపజేసే అంశాన్ని తమ ప్రభుత్వం ముందు పెట్టాయి. సింగపూర్‌ నిర్మాణ సంస్థల్లో భారీ స్థాయిలో చైనా, భారత, బంగ్లాదేశీ కార్మికులే అధికంగా పని చేస్తుంటారు. వారిపై ఆంక్షలు విధించడంతో పనులపై ప్రభావం పడింది.

-ఆర్​కే మిశ్రా

రచయిత-ప్రముఖ పాత్రికేయులు

ఇదీ చదవండి :వైరస్​తో 'పోరు' కన్నా పక్కింటి 'తీరు' దారుణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.